Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

పెగాసస్‌పై విచారణకు టెక్నికల్‌ కమిటీ.. : సుప్రీంకోర్టు

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన పెగాసస్‌ స్పైవేర్‌తో ప్రముఖుల ఫోన్లు హ్యాకింగ్‌ వ్యవహారంపై విచారణకు సాంకేతిక నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఇవాళ ఓ కేసు విచారణ సందర్భంగా సీజే వ్యాఖ్యానిస్తూ.. పెగాసస్‌ వ్యవహారంపై వచ్చే వారం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. నిజానికి ఈ కమిటీ ఏర్పాటుపై ఈ వారంలో ఉత్తర్వులు జారీచేయాలని కోర్టు భావించింది. అయితే సాంకేతిక కమిటీలో సభ్యులుగా ఉండేందుకు కొందరు నిపుణులు అభ్యంతరం వ్యక్తంచేయడంతో కమిటీ ఏర్పాటు ఆలస్యమవుతోందని చీఫ్‌ జస్టిస్‌ వెల్లడిరచారు. అతి త్వరలో సభ్యులను ఖరారు చేసి సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. దీనిపై వచ్చే వారం ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. ఇజ్రాయిలీ స్పైవేర్‌ పెగాసస్‌తో పతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులపై నిఘా పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలపై నమోదు అయిన పలు పిటిషన్లను సుప్రీం విచారిస్తున్నది.. సెప్టెంబర్‌ 13వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా తన ఆదేశాలను చీఫ్‌ జస్టిస్‌ రిజర్వ్‌లో ఉంచారు. పెగాసస్‌ ్‌పై తాము ఏమీ దాచిపెట్టడం లేదని, జాతీయ భద్రత దృష్టా నిఘా సాగినట్లు కేంద్రం తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img