Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

పెరుగుతున్న కరోనా కేసులు..1700కు చేరిన ఒమిక్రాన్‌ బాధితులు

దేశంలో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 33,750 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవగా… 123 మంది మృతి చెందారు. అలాగే కరోనా నుంచి కోలుకుని 10,486 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,45,582గా ఉండగా, కోలుకున్న వారి సంఖ్య 3,42,95,407గా ఉంది. దేశ వ్యాప్తంగా కోవిడ్‌తో 4,81,893 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 1700కి చేరింది. 639 మంది ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్నారు. 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 510, ఢల్లీిలో 351, కేరళ 156, గుజరాత్‌ 136, తమిళనాడు 121, రాజస్థాన్‌ 120, తెలంగాణ 67, కర్ణాటక 64, హర్యానా 63 ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. ఇక టీకా తీసుకున్న వారి సంఖ్య 1,45,68,89,306గా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img