Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

పోలవరంపై కేంద్రం అన్యాయం

. ఇప్పటికైనా సీఎం నోరు తెరవాలి
. 26, 27 తేదీల్లో కలెక్టరేట్ల ఎదుట దీక్షలు: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం…ఇవాళ నిండా ముంచి ప్రాజెక్టును సక్రమంగా పూర్తి చేయకుండా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. పోలవరంపై కేంద్రం పదేపదే అన్యాయం చేస్తున్నప్పటికీ…రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకుండా చోద్యం చూస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రాజెక్టు ఎత్తును 135 అడుగులకు తగ్గించి, అక్కడ 92 టీఎంసీలే నిల్వ ఉంచడం వల్ల ఏరకంగానూ మన రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరవని స్పష్టంచేశారు. దీనివల్ల ప్రత్యేకించి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఘోరంగా దెబ్బతింటాయన్నారు. దీంతో రాజకీయ నాయకులు, ఇంజినీర్లు, నిపుణులంతా 156 అడుగుల ఎత్తు, 196 టీఎంసీల నీటి నిల్వకు పోలవరం ప్రాజెక్టును ప్రతిపాదించారని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ఎత్తు తగ్గిస్తున్నాయని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. దీనిపై సీపీఐ రాష్ట్ర సమితి అధ్వర్యంలో ఈ నెల 26, 27 తేదీల్లో జిల్లా కలెక్టరేట్ల ఎదుట దీక్షలు చేపడుతున్నామన్నారు. కేంద్రం దిగివచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. ఇప్పటికైనా ఈ అన్యాయంపై సీఎం జగన్‌ నోరు మెదపకుంటే చరిత్ర హీనులుగా మిలిపోతారన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో సీఎం సమావేశం నిర్వహించి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, ఎత్తు తగ్గించకుండా చర్యలు చేపట్టాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img