Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

పోలీసు ఉద్యోగాలకు డాక్టరేట్లు, ఎంటెక్‌ గ్రాడ్యుయేట్లు

నేడు రాత పరీక్ష

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు కానిస్టేబుల్‌ పోస్టులకు ఆదివారం రాతపరీక్ష జరుగుతుంది. ఇందుకుగాను ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆశ్చర్యమేమంటే పోలీసు కానిస్టేబుల్‌ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో 10 మంది పీహెచ్‌డీ పొందిన వారు, 930మంది ఎంటెక్‌ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. కానిస్టేబుల్‌ పోస్టుకు ఇంటర్మీడియట్‌ను విద్యార్హతగా రాష్ట్రస్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్ణయించింది. అభ్యర్థుల జాబితాలో 5,284 మంది ఎంబీఏ, 4,365 మంది ఎంఎస్‌సీ, 94 మంది ఎల్‌ఎల్‌బీ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. మొత్తంగా 13,961 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, 1,55,537 మంది అండర్‌ గ్రాడ్యుయేట్లు పోలీసు పరీక్షకు హాజరవుతున్నారు. మొత్తం 6,400 పోస్టులకుగాను 5,03,486మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 5,03,486 మంది అభ్యర్థులకుగాను 3,95,415 మంది పురుషులు, 1,08,071 మంది మహిళలు పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img