Wednesday, September 28, 2022
Wednesday, September 28, 2022

ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు

రాజకీయనేతలకు డీజీపీ గౌతం సవాంగ్‌ హితవు
పట్టుబడ్డ హెరాయిన్‌తో ఏపీకి సంబంధం లేదు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : వాస్తవాలను పదేపదే వక్రీకరిస్తూ ప్రకటనలు చేయడం సమంజసం కాదని, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని డీజీపీ గౌతం సవాంగ్‌ హితవు పలికారు. ఇటీవల గుజరాత్‌లో పట్టుబడిన రూ.21 వేల కోట్ల హెరాయిన్‌కు సంబంధించి మూలాలు ఏపీలోనే ఉన్నట్లు రాజకీయ నేతలు చేస్తున్న ఆరోపణలపై డీజీపీ గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. అసత్య ఆరోపణలు చేయడం వలన ప్రజలలో అపోహలు కలగడమే కాకుండా అభద్రతా భావానికి లోనయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు కచ్చితమైన సమాచారాన్ని సేకరించి, నిజానిజాలు బేరీజు వేసి మాట్లాడాల్సిన అవసరం ప్రజాప్రతినిధులపై ఉందన్న విషయాన్ని మరిచిపోవడం బాధాకరమన్నారు. గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన ముంద్రా పోర్ట్‌లో డీఆర్‌ఐ అధికారులు హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్న అంశంపై విజయవాడ పోలీసు కమిషనర్‌ ఇప్పటికే విజయవాడకు సంబంధం లేదని చెప్పినా రాజకీయ నాయకులు అసత్యాలు ప్రచారం చేయడం తగదన్నారు. డీఆర్‌ఐ, కేంద్ర సంస్థలు, పత్రికలు విజయవాడకు సంబంధం లేదని ధృవీకరిస్తున్నా…సీనియర్‌ నాయకుడు అపోహలు సృష్టించేలా మాట్లాడటం భావ్యం కాదన్నారు. ఆషి ట్రేడిరగ్‌ కంపెనీ చిరునామా మాత్రమే విజయవాడగా ఉందని, వారి కార్యకలాపాలు ఇసుమంతైనా రాష్ట్రంలో లేవని స్పష్టం చేశారు. అఫ్గానిస్థాన్‌ నుండి ముంద్రా పోర్టుకు వేరే కన్సైన్మెంట్‌ ముసుగులో హెరాయిన్‌ దిగుమతి చేసుకొనే క్రమంలో పట్టుబడిరదిగా మాత్రమే డీఆర్‌ఐ, కేంద్ర సంస్థల అధికారులు వెల్లడిరచారన్నారు. ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రకటనలు చేయడం, ప్రజల మనసుల్లో భయాందోళనలు రేకెత్తించడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img