Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

ప్రజాఉద్యమాలపై దాడులా?

లెబనీస్‌ కమ్యూనిస్టు పార్టీ ఆగ్రహం
బీరుట్‌: పశ్చిమాసియా దేశం లెబనాన్‌లో ప్రజా ఉద్యమానికి వ్యతిరేకంగా పాలకపార్టీ జరుపుతున్న దాడులను లెబనీస్‌ కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిరచింది. బీరుట్‌ పేలుడు జరిగిన 1వ వార్షికోత్సవం సందర్భంగా ప్రదర్శనకారులకు వ్యతిరేకంగా లెబనాన్‌లో ఫాసిస్టు మిలీషియాపార్టీ అమానవీయంగా దాడి జరిపిన విషయం తెలిసిందే… ట్రేడ్‌ యూనియన్లు, వామపక్షవాదులు, వర్తక సంఘాలు కలిసి బీరుట్‌లోని వివిధ ప్రాంతాల్లో జరుపుతున్న ప్రదర్శనలను నిలువరించేందుకుగాను ప్రభుత్వం ప్రజలపై కత్తులు, కర్రలు, రాళ్లతో దాడిచేసి గాయపరచారు. నిరంకుశ విధానల ద్వారా చేపట్టిన ఈ దాడుల్లో డజన్లమంది గాయపడ్డారు. వీరిలో 7గురు తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ప్రజా శాంతికి ముప్పు కలిగించే ప్రజాస్వామ్య శక్తులపై పాలకపార్టీలు చేపట్టిన ఫాసిస్టు దాడులను లెబనీస్‌ కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిరచింది. నిరసన తెలుపుతున్న వ్యక్తుల అణచివేతలకు పాలక పార్టీ చేపట్టిన దౌర్జన్యాన్ని సహించరానిదిగా పేర్కొంది. ప్రజలకు జవాబుదారీతనం, లౌకికవాదం, సామాజిక న్యాయంకోసం పోరాడుతున్న ప్రజా ఉద్యమాలకు లెబనీస్‌ కమ్యూనిస్టు పార్టీ సంఫీుభావాన్ని ప్రకటించింది. ఈపరిణామాలను బహిర్గతం చేసే వీడియోను కూడా కమ్యూనిస్టు పార్టీ లింక్‌లను విడుదలచేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img