Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

ప్రజాప్రతినిధులపై క్రిమినల్‌ కేసులు ఏదశలో ఉన్నాయి?

25 లోగా నివేదిక ఇవ్వాలి బ కేంద్రానికి సుప్రీం ఆదేశం
హైకోర్టుల అనుమతి లేకుండా కేసుల ఉపసంహరణ కుదరదు
కేసుల పర్యవేక్షణకు ప్రత్యేక బెంచ్‌
రాజకీయపార్టీలు అభ్యర్థుల నేర చరిత్రను బహిర్గతం చేయాలి

రాజకీయ వ్యవస్థను నేరరహితంగా మార్చే దిశగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పులను వెలువరించింది. ఆగస్టు 25లోపు దేశంలో ప్రజాప్రతినిధులపై దాఖలైన కేసుల విచారణపై స్టేటస్‌ రిపోర్ట్‌ అందించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

న్యూదిల్లీ : రాజకీయ వ్యవస్థను నేరరహితంగా మార్చే దిశగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పులను వెలువరించింది. ఆగస్టు 25లోపు దేశంలో ప్రజాప్రతినిధులపై దాఖలైన కేసుల విచారణపై స్టేటస్‌ రిపోర్ట్‌ అందించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ప్రజాప్రతినిధులపై దాఖలైన కేసుల విచారణ వేగంగా జరపాలన్న పిటిషన్లపై సీజేఐ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసం విచారణ చేపట్టింది. చట్టసభలకు ప్రాతినిథ్యం వహించే ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్‌ కేసులను హైకోర్టుల అనుమతి లేకుండా దర్యాప్తు అధికారులు ఉపసంహరించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల పర్యవేక్షణకు సుప్రీం కోర్టులో ఓ ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు కూడా సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులను విచారిస్తున్న ప్రత్యేక కోర్టుల న్యాయమూర్తులను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు బదిలీ చేయరాదని పేర్కొంది. ప్రత్యేక కోర్టుల్లో చట్టసభ సభ్యులపై ఉన్న కేసులు, పెండిరగ్‌లో ఉన్నవి, తీర్పులు వచ్చిన వాటిపై సమాచారం అందించాలని హైకోర్టుల రిజిస్ట్రార్‌జనరల్‌లను ఆదేశించింది. సీనియర్‌ న్యాయవాదులు విజయ్‌ హన్సారియా, స్నేహ కలిత నుంచి నివేదికలు అందిన క్రమంలో ఈ ఆదేశాలిచ్చింది. ఈ కేసుల విచారణలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం సరిగ్గా లేదని సుప్రీం మండిపడిరది. కేసుల స్థితి దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు వారాల సమయం కోరింది. కాగా ఇలా ప్రతిసారీ సమయం కోరడంపై సీజేఐ రమణ అసహనం వ్యక్తం చేశారు. స్టేటస్‌ రిపోర్టు అందించేందుకు అంత సమయం ఎందుకని ప్రశ్నించారు. రెండు వారాల గడువు ఇస్తున్నామని, ఇదే చివరి అవకాశమని స్పష్టం చేశారు. అలోగా స్టేటస్‌ రిపోర్టు దాఖలు చేసి ప్రతివాదులందరికీ అందజేయాలన్నారు. ఈ నెల 25న మళ్లీ విచారణ చేపట్టనున్నట్లు సీజేఐ తెలిపారు.
రాజకీయపార్టీలకు హుకుం
ఎన్నికల వేళ ఆయా పార్టీలు అభ్యర్థుల నేరచరిత్రను 48 గంటలలోపు వెల్లడిరచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నేరచరిత్రను బహిర్గతం చేయని పార్టీల గుర్తును నిలిపివేయాలంటూ ఎన్నికల సంఘానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. 2020 ఫిబ్రవరి తీర్పులోని పేరా 4.4 లో అభ్యర్థిని ఎంపిక చేసిన 48 గంటలలోపు లేదా నామినేషన్ల దాఖలుకు మొదటితేదీకి రెండు వారాల ముందు వారి నేరరికార్డులను ప్రకటించాలని సుప్రీం ఆదేశించింది. గత ఏడాది నవంబరులో జరిగిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల నేరచరిత్ర పూర్వపరాలను ప్రచురించడంలో పార్టీలు విఫలమైనందుకు దాఖలు చేసిన ధిక్కార పిటిషన్ల విచారణలో సుప్రీం ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌, బిఆర్‌ గవాయ్‌ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం 2020 ఫిబ్రవరి 13 న ఇచ్చిన తీర్పును సవరించింది. కాగా నేర చరితుల అంశంలో గతంలో తమ ఆదేశాలకు సంబంధించి బీజేపీ, కాంగ్రెస్‌ సహా 9 పార్టీలు తప్పిదానికి పాల్పడ్డట్టు గుర్తించింది. వాటిలో 8 పార్టీలకు జరిమానా విధించింది. ఈ సందర్భంగా ద్విసభ్య ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
పార్టీలు మొద్దు నిద్ర వీడేందుకు నిరాకరిస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేసింది. పదేపదే చెబుతున్నా వీరికి తలకెక్కడం లేదని ఆగ్రహం వెలిబుచ్చింది. రాజకీయ నాయకులు దీనిపై త్వరగానే మేల్కొని, రాజకీయాలను నేరచరితుల మయం కాకుండా సుదీర్ఘ ప్రక్షాళన చేపడతారని భావిస్తున్నామని పేర్కొంది. ఈ కేసులో కాంగ్రెస్‌, బీజేపీ సహా ఐదు పార్టీలకు రూ.1 లక్ష చొప్పున… సీపీఎం, ఎన్సీపీలకు రూ.5 లక్షల చొప్పున సుప్రీం ధర్మాసనం జరిమానా విధించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img