Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

ప్రధానే ప్రచారం చేస్తున్నారుగా : ఖర్గే

న్యూదిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సాధ్యమైనంత త్వరగా జరపాలా, వాయిదా వేయాలా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో తాజాగా జరుగుతున్న చర్చకు కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ మల్లికార్జున ఖర్గే మంగళవారం స్పందించారు. ఎన్నికలు జరపాలన్న వాదనకు మద్దతిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు సమావేశాలకు సైతం హాజరుకాకుండా స్వయంగా ర్యాలీల్లో పాల్గొంటూ, ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తుంటే ఎన్నికలను ఎందుకు ఆపాలని ఖర్గే ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వమే స్వయంగా ఎన్నికలను సమర్ధిస్తోందన్నారు. అలాంటప్పుడు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుపొచ్చని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img