Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

ప్రపంచ వారసత్వ సంపదగా.. ధోలవిరా

భారత్‌కు చెందిన మరో ప్రాచీన పట్టణానికి అరుదైన గుర్తింపు లభించింది. ఇటీవలే తెలంగాణలోని ప్రసిద్ధ రామప్ప దేవాలయానికి యునెస్కో వారసత్వ గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. గుజరాత్‌లోని ధోలవిరా ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో జాబితాలో చేర్చింది. ధోలవిరకు వరల్డ్‌ హెరిటేజ్‌ జాబితాలో చోటు దక్కిన విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్‌ రెడ్డి ఇవాళ తన ట్విట్టర్‌లో తెలిపారు. ధోలవిరా ఇప్పుడు భారత్లో 40వ వారసత్వ సంపదగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. భారత్‌ ఇవాళ గర్వపడాల్సిన దినమని, ముఖ్యంగా గుజరాతీ ప్రజలకు ఇది శుభదినమన్నారు. ధోలవిరా గుజరాత్‌లోని కచ్‌జిల్లాలో ఉంది. హరప్పా నాగరికత కాలంలో ప్రసిద్ధ పట్టణమిది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img