ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కు కరోనా సోకింది. ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆమె సమీప బంధువు రచ్నా మీడియాకు మీడియాకు వెల్లడిరచారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్‌కు స్వల్ప లక్షణాలున్నాయి. కానీ వయసు రీత్యా ముందు జాగ్రత్త కోసం మాత్రమే ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.గతంలో 2019 నవంబర్ లో శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ లతా మంగేష్కర్ ఆసుపత్రిలో చేరారు.కరోనా వైరస్ మొదటి దశలో కూడా లతా మంగేష్కర్‌కు కొవిడ్ నిర్ధారణ అయ్యింది.