Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

ప్రముఖ గాయని వాణీజయరాం కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ గాయని వాణీజయరాం (78) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. వాణీ జయరాం దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నేపథ్య గాయకురాలు. వాణీజయరామ్‌ అసలు పేరు కలైవాణి. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్‌ 30న జన్మించారు. ఆమె 1971లో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఐదు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. ఆమె సుమారు వేయి సినిమాలలో 20,000 పాటలకు నేపధ్యగానం చేశారు. అంతే కాకుండా వేల సంఖ్యలో భక్తి గీతాలను కూడా పాడారు. వాణీ జయరాంకు ఇటీవలే కేంద్రం పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img