Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతే

రాజ్యసభలో కేంద్ర మంత్రి ప్రకటన
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అమరావతే అని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. . ‘ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏది..? రాజధానిని నిర్ణయించే అధికారం ఎవరిది..?’ అన్నదానిపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని రాజ్యసభలో ఎంపీ జీవీఎల్‌ నరసింహారావ్‌ కోరారు. ఇందుకు స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ ప్రస్తుతానికి అమరావతే ఏపీ రాజధాని అని పేర్కొన్నారు. అంతేకాదు.. ‘రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే. మా దగ్గరున్న సమాచారం ప్రకారం ఏపీకి రాజధాని అమరావతే’ అని కూడా కేంద్రం తరఫున మంత్రి స్పష్టంచేశారు. మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తమ దృష్టికొచ్చిందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img