Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

ప్రారంభమైన కేంద్ర హోంశాఖ కీలక సమావేశం

హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా నేతృత్వంలో కేంద్ర హోంశాఖ కార్యాలయం నార్త్‌ బ్లాక్‌లో విభజన సమస్యల పరిష్కార సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఏపీ సీఎస్‌ సమీర్‌ శర్మ, తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, రెండు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి హోంశాఖ సమావేశానికి 12 మందికి పైగా ఐఏఎస్‌లు ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశానికి హాజరైన తెలంగాణ ఫైనాన్స్‌ స్పెషల్‌ సీఎస్‌ రామ కృష్ణారావు, ఇంధన శాఖ స్పెషల్‌ సీఎస్‌ సునీల్‌ శర్మ, రోడ్లు-భవనాల శాఖ నుంచి శ్రీనివాసరావు, సివిల్‌ సప్లయిస్‌ అనిల్‌ కుమార్‌, ఉన్నత విద్యా శాఖ నవీన్‌ మిట్టల్‌ సింగరేణి కాలరీస్‌ నుంచి శ్రీనివాసరాజు సహా పలువురు అధికారుల బృందం హాజరైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img