Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

ప్రేమ, త్యాగానికి ప్రతీక.. బక్రీద్‌

కొవిడ్‌ నిబంధనల నడుమ దేశవ్యాప్తంగా ఇవాళ ముస్లిం సోదరులు ఈద్‌ అల్‌ అదా పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. బక్రీద్‌ పండుగ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని మసీదుల్లో ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు. జామియా మసీదులో బక్రీద్‌కు సామూహిక ప్రార్థనలను నిషేధించారు. కేవలం స్థానికులు మాత్రమే మసీదుకు వచ్చారు.ముంబైలోని మాహిమ్‌ దర్గాలో, అహ్మదాబాద్‌లోని జమా మసీదులో ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈద్‌ అల్‌ అదా సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ ముస్లిం సోదరులకు ఈద్‌ ముబారక్‌ చెప్పారు. ప్రేమ, త్యాగానికి ప్రతీకంగా బక్రీద్‌ పండుగని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img