Monday, February 6, 2023
Monday, February 6, 2023

ఫడ్నవీస్‌కు నవాబ్‌ మాలిక్‌ మేనల్లుడు లీగల్‌ నోటీసు

మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు, మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్‌ మాలిక్‌కు మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నవాబ్‌ మాలిక్‌ మేనల్లుడు సమీర్‌ఖాన్‌ తెన పరువుకు భంగం కలిగించేలా ఫడ్నవిస్‌ తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఫడ్నవిస్‌కు లీగల్‌ నోటీసు పంపారు. తనను మానసిక సంక్షోభానికి, ఆర్థిక నష్టానికి గురిచేసినందును అయిదు కోట్ల నష్టపరిహారం డిమాండు చేశారు. మాలిక్‌ కూతురు నీలోఫర్‌ మాలిక్‌ ఖాన్‌ లీగల్‌ నోటీసుకు చెందిన కాపీని ఇవాళ రిలీజ్‌ చేశారు. లాయర్‌ రెహ్మాత్‌ అన్సారీ ద్వారా ఆ నోటీసులు ఫడ్నవీస్‌కు పంపారు.ఈ ఏడాది జనవరి 13వ తేదీన సమీర్‌ ఖాన్‌ను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు ఓ డ్రగ్‌ కేసులో అరెస్టు చేశారు. ఆ తర్వాత సెప్టెంబర్‌ 27వ తేదీన అతన్ని విడుదల చేశారు. మంత్రి మాలిక్‌ అల్లుళ్లు డ్రగ్స్‌తో దొరికారని ఇటీవల ఫడ్నవీస్‌ ఆరోపించారు. అయితే ఎన్సీబీ దాఖలు చేసిన చార్జీషీట్‌లో తమపై ఎటువంటి ఆరోపణలు లేవని మాలిక్‌ అలుళ్లు తమ లీగల్‌ నోటీసులో తెలిపారు.జనవరి 14వ తేదీన ఇచ్చిన పంచనామా ప్రకారం తమ ఇంట్లో మాదక ద్రవ్యాలు దొరకలేదని, మీరెలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని లీగల్‌ నోటీసులో మాలిక్‌ అల్లుడు ప్రశ్నించాడు. ఫడ్నవీస్‌ స్పందన కోసం ఎదురుచూస్తున్నామని, ఆ తర్వాత తమ తదుపది చర్యలు మొదలుపెడుతామని మాలిక్‌ కూతురు చెప్పారు. ఫడ్నవీస్‌ క్షమాపణలు చెప్పకుంటే, తాము నష్టపరిహారం దావాతో కోర్టుకు వెళ్లనున్నటు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img