Friday, December 2, 2022
Friday, December 2, 2022

ఫ్లోరిడాలో ఇయాన్‌ బీభత్సం

. జలదిగ్బంధంలో రాష్ట్రం
. చిమ్మచీకటిలో 25 లక్షల మంది

. గంటకు 665కిమీల వేగంతో ఈదురుగాలులు
. విరిగిపడ్డ చెట్లు కొట్టుకుపోయిన వంతెనఇళ్ల పైకప్పులువాహనాలు బ కాలువలో పడి వృద్ధుడి మృతి . మృతుల సంఖ్య పెరిగే అవకాశం బ వీధుల్లో షార్కుల సంచారం వెయ్యి ఏళ్లలో ఒకసారి వచ్చే భీకర తుపాను

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ : అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో పెనుతుపాను ‘ఇయాన్‌’ బీభత్సం సృష్టించింది. మొత్తం రాష్ట్రం అతలాకుతలమైంది. విద్యుత్‌, టెలిఫోన్‌ సేవలు స్తంభించిపోయాయి. 25లక్షల మంది అంధకారంలో చిక్కుకున్నారు. వరద నీరు ఇళ్లలోకి చేరుకుంది. వృక్షాలు విరిగిపడ్డాయి. వీధులు నదులుగా మారగా అందులోకి షార్కులు సైతం వచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చక్కర్లు కొట్టాయి. వంతెన కొట్టుకుపోయింది. వరద నీటికి వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో భారీగా ఆస్తి`ప్రాణ నష్టం జరిగే అంచనాలు ఉన్నట్లు అధికారులు వెల్లడిరచారు. కాలువలో పడి ఓ వృద్ధుడు మరణించినట్లు ధ్రువీకరించారు. తొలుత క్యూబాలో బీభత్సం సృష్టించిన అనంతరం ఇయాన్‌ తుపాను ఫ్లోరిడాని తాకిందని అన్నారు. గంటలకు 665 కిమీల వరకు వేగంతోఈదురు గాలులు వీస్తుండగా ప్రజలు అష్టకష్టాలు పడుతున్నట్లు వెల్లడిరచారు. కుండపోత వర్షం, ఈదుగు గాలులు, టెలిఫోన్‌, విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన క్రమంలో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగిందని అన్నారు. అత్యంత తీవ్రమైన తుపాన్లలో ఇయాన్‌ ఒకటి అని అన్నారు. ఫ్లారిడా తీరంలో 8 నుంచి 10 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. ఇయాన్‌ను కేటగిరీ 4 తుపాను అని వెయ్యి ఏళ్లలో ఒకసారి ఇలాంటి విపత్తు సంభవిస్తుందని అధికారులు నిర్ధారించారు. ఫ్లారిడా ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హామీ ఇచ్చారు.
వందల ఇళ్లు జలదిగ్బంధంలో ఉన్నాయి. బారియర్‌ ద్వీపకల్పాన్ని అనుసంధానం చేసే ఏకైక వంతెన దెబ్బతిన్నది. ఆసుపత్రి ఐసీయూ పైకప్పు ధ్వంసం అయింది. 2.5 మిలియన్ల మంది అంధకారంలో చిక్కుకుపోయారు. నడుము లోతు నీళ్లలో షార్కులు కొట్టుకొచ్చిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. గురువారం 72ఏళ్ల వ్యక్తి మృత్యువాత పడినట్లు అధికారులు ధ్రువీకరించారు. దయటోనా బీచ్‌ సమీపంలోని డాల్టోనాలోని ఇంటి వద్ద కాలువలో వృద్ధుడు కొట్టుకుపోయినట్లు వొలుసియా కౌంటీ షరీఫ్‌ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. మృతుల సంఖ్య వందల్లో ఉండవచ్చు అంటూ ఫ్లోరిడా షరీఫ్‌ తెలిపారు. ఫోర్ట్‌ మైర్స్‌తో పాటు దేశంలో సహాయం కోసం వేలల్లో ఫోన్‌కాల్స్‌ 911కు వస్తున్నట్లు లీకౌంటీ షరీఫ్‌ కార్మీన్‌ మార్సెనో తెలిపారు. సహాయం కోసం వేలల్లో అభ్యర్థనలు వస్తుండగా ఇంకా ఎంత మంది సాయం కోసం వేచివున్నారో తెలియడం లేదన్నారు. అత్యవసర సేవా సిబ్బంది రంగంలోకి దిగి విరిగి పడ్డ చెట్లను తొలగిస్తూ వరదల్లో చిక్కుకున్న వారిని చేరుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. విద్యుత్‌ సరఫరా లేక ఫోన్‌ సేవలు నిలిచిపోయి అంధకారంలో లక్షల కుటుంబాలు ఉన్నట్లు వెల్లడిరచారు. ఫోన్‌ సేవలను తాత్కాలికంగా పునరుద్ధరించేందుకు పోర్టబుల్‌ టవర్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారి చెప్పారు. తెల్లవారేసరికి భయానక దృశ్యం ఆవిష్కృతం కావచ్చు అని అన్నారు.
మరోవైపు వలసదారుల పడవ మునిగిపోయిందని యూఎస్‌ బోర్డర్‌ పెట్రోలింగ్‌ అధికారులు వెల్లడిరచారు. అందులోని క్యూబాకు చెందిన 23 మంది వలసకూలీలు గల్లంతు కాగా వారిలో నలుగురు మాత్రం ఒడ్డుకు చేరుకున్నారని మియామీ చీఫ్‌ పెట్రోల్‌ ఏజెంట్‌ వాల్టర్‌ స్లోసర్‌ ట్విట్టర్‌లో వెల్లడిరచారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఫ్లోరిడాలో పది లక్షల కంటే ఎక్కువ మంది నిర్వాసితులయ్యారు. చాలామంది తమ ఇళ్లను కోల్పోయారు. అత్యంత ప్రమాదకరమైన ఇయాన్‌ తుపాను బుధవారం సాయంత్రం తీరాన్ని తాకిందని నేషనల్‌ హరికేన్‌ సెంటర్‌(ఎన్‌హెచ్‌సీ) వెల్లడిరచింది. వార్తాసేకరణలో ఉన్న ఓ విలేకరి ఈదురు గాలికి నిల్చులేక ఇబ్బంది పడిన వీడియో ఒకటి వైరల్‌ అయింది.
క్యూబాలోనూ… : క్యూబాలో ఇయాన్‌ తుపాను భారీ విధ్వంసాన్ని సృష్టించింది. రోడ్లకు అడ్డంగా చెట్టు విరిగి పడ్డాయి. రాజధాని హవానాతో పాటు అనేక ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. పినార్‌ డెల్‌ రియోను వరద ముంచెత్తింది. పవర్‌ గ్రిడ్‌ దెబ్బతిని 1.20 కోట్ల మంది అంధకారంలో చిక్కుకున్నారు. విద్యుత్‌ సరఫరాను ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియక ఇబ్బంది పడ్డారు. పొగాకు పంటకు భారీగా నష్టం వాటిల్లింది. ముందు జాగ్రత్తగా దాదాపు 25 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణనష్టం తప్పినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img