Friday, March 24, 2023
Friday, March 24, 2023

బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయంపై
అనంతపురంలో సీపీఐ నిరసన

మోదీ దిష్టబొమ్మ, ప్లకార్డుల దగ్ధం

విశాలాంధ్ర`అనంతపురం అర్బన్‌: కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని, ప్రత్యేక హోదా విభజన హామీల ఉసేలేకపోవడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ అధ్వర్యాన గురువారం అనంతపురంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడి సప్తగిరి సర్కిల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మతో పాటు ప్లకార్డులను దగ్ధంచేసి కేంద్ర బడ్జెట్‌కు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్రబడ్జెట్‌లో ఏపీని మోసంచేసిన మోదీ డౌన్‌డౌన్‌, అమరావతికి నిధులివ్వలేని మోదీ, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు నిధులివ్వలేని మోదీ అని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్‌ మాట్లాడుతూ, రాష్ట్రానికి జీవనాడిగా పేర్కొంటున్న పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రస్తావనే బడ్జెట్‌లో లేకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య, రమణ, రాజేష్‌ గౌడ్‌, సంతోష్‌ కుమార్‌, నగర సహాయ కార్యదర్శి అల్లిపీరా, కార్యవర్గ సభ్యులు చాంద్‌ బాషా, బంగారు బాషా, సుందర్‌ రాజు, నాగప్ప తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img