Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

బాలల అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్‌ నం.3

టాప్‌ 2లో ఉత్తరప్రదేశ్‌, బీహార్‌
దిల్లీ, కర్నాటకలో పెరిగిన కేసులు

పెరుగుతున్న పేదరికంతో వ్యవస్థీకృత నేరాలు పెరిగాయి. బాలబాలికలు, యువతులు, మహిళల అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వాలు చెబుతున్నాగానీ అక్రమ రవాణా ముఠాల ఆగడాలకు అంతం ఉండటం లేదు. అభంశుభం తెలియని పిల్లలను ఎత్తుకెళ్లి, అక్రమంగా రవాణా చేసే నేరాలు ఇటీవల పేట్రేగిపోయాయి. కోవిడ్‌ తర్వాత పరిస్థితి మరింత క్షీణించింది. మానవుల అక్రమ రవాణాదారులకు పేదలు, బలహీనులు లక్ష్యంగా మారుతున్నారు. అక్రమ రవాణా బాధితుల్లో సుమారు 70 శాతం మంది మహిళలు, బాలికలు కాగా మూడిరట ఒక వంతు పిల్లలు ఉన్నారు.

న్యూదిల్లీ: భారత్‌లో బాలల అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్‌ నంబర్‌ 3గా ఉంది. టాప్‌ 2లో ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలు ఉన్నాయి. 2016`2022 మధ్య అత్యధికంగా పిల్లల అక్రమ రవాణా ఈ మూడు రాష్ట్రాల్లోనే జరిగినట్లు కైలాశ్‌ సత్యర్థి బాలల ఫౌండేషన్‌ (కేఎస్‌సీఎఫ్‌) అనే ఎన్జీవో తాజాగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. కోవిడ్‌కు ముందు, తర్వాత దేశ రాజధాని దిల్లీలో బాలల అక్రమ రవాణా కేసుల్లో 68శాతం పెంపుదల నమోదైందని, కర్నాటకలోనూ 18శాతం పెంపుదల ఉందని, 6 నుంచి 110కు కేసులు పెరిగాయని నివేదిక తెలిపింది. ప్రపంచ మానవుల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ‘భారత్‌లో పిల్లల అక్రమ రవాణా: పరిస్థితులాధారంగా డేటా విశ్లేషణ, సాంకేతికత ఆధారిత వ్యూహాల’ పేరుతో నివేదిక విడుదలైంది. గేమ్స్‌ 24I7, కేఎస్‌సీఎఫ్‌

సంయుక్తంగా జరిపిన అధ్యయనం క్రమంలో తాజా గణాంకాలు వెల్లడయ్యాయి. రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌ నంబర్‌ వన్‌ కాగా జిల్లాలవారీగా జైపూర్‌ దేశానికి హాట్‌స్పాట్‌గా ఉంది. మొత్తం 21 రాష్ట్రాల్లోని 262 జిల్లాల్లో అధ్యయనం జరిగింది. 2016 నుంచి 2022 వరకు 18ఏళ్ల లోపు పిల్లలు 13,549 మందిని అక్రమ రవాణా నుంచి కాపాడగలిగినట్లు నివేదిక వెల్లడిరచింది. వీరిలో 80 శాతం మంది 1318 మధ్య వయస్కులు కాగా 13 శాతం మంది 912 ఏళ్ల వారు, రెండు శాతం మందికిపైగా తొమ్మిదేళ్ల లోపు పిల్లలని తెలిపింది. ఈ క్రమంలో అన్ని వయస్కుల్లోని పిల్లలు అక్రమ రవాణా బారిన పడుతున్నారని, ఇది విస్తృతమైన సమస్యగా మారిందని నివేదిక పేర్కొంది. పిల్లల అక్రమ రవాణా కేసలు ఉత్తరప్రదేశ్‌లో కోవిడ్‌కు ముందు (201619లో) 267 ఉంటే కోవిడ్‌ తర్వాత (202122లో) 1214కు పెరిగినట్లు వెల్లడిరచింది.
అదే సమయంలో పరిశ్రమల్లో బాల కార్మికులు ఎక్కువని తెలిపింది. హోటళ్లు, ఢాబాలలో 15.6శాతం మంది బాల కార్మికులు ఉండగా ఆటోమొబైల్‌ లేక రవాణా రంగంలో 13శాతం, వస్త్రవ్యాపారంలో 11.18శాతం మంది చొప్పున ఉన్నట్లు పేర్కొంది. 5`8 ఏళ్ల పిల్లలు కాస్మెటిక్‌ పరిశ్రమలో పనిచేస్తున్నట్లు నివేదిక వెల్లడిరచింది. ఈ పరిస్థితుల దృష్ట్యా మానవుల అక్రమ రవాణా కట్టడికి పటిష్ఠ చర్యలు, విస్తృత అవగాహన అత్యవసరమని నొక్కిచెప్పింది. సమగ్ర అక్రమ రవాణా వ్యతిరేక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వానికి నివేదిక సూచించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img