Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

బిగ్‌బాస్‌ షోలో అశ్లీలతపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

బిగ్‌బాస్‌ షోను బ్యాన్‌ చేయాలని దాఖలైన పిల్‌పై హైకోర్టులో విచారణ వ్యక్తం చేసింది. పిటిషన్‌ తరపున న్యాయవాది ఐబీఎఫ్‌ గైడ్‌ లైన్స్‌ పాటించలేదన్నారు. బిగ్‌బాస్‌ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందని పిటిషనర్‌ తరుపున న్యాయవాది శివప్రసాద్‌ రెడ్డి పేర్కొన్నారు. న్యాయస్థానం సైతం అశ్లీలతపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం తరఫు న్యాయవాది దీనిపై స్పందించేందుకు సమయం కోరారు. ప్రతివాదులకు నోటీసుల విషయాన్ని తదుపరి వాయిదాలో నిర్ణయిస్తామని న్యాయస్థానం తెలిపింది. విచారణను అక్టోబరు 11కు న్యాయస్ధానం వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img