Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

బిపిన్‌ రావత్‌ దంపతుల అంతిమయాత్ర

బిపిన్‌ రావత్‌ దంపతుల అంతిమయాత్ర ప్రారంభమైంది.ఢల్లీి కామ్రాజ్‌ మార్గ్‌ లోని రావత్‌ నివాసం నుంచి వారి భౌతికకాయాలనుంచిన వాహనం ఢల్లీి కంటోన్మెంట్‌లోని బ్రార్‌ స్క్వేర్‌లోని శ్మశానవాటికకు బయలుదేరింది. ప్రజలు, నేతలు, సైనికులు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. అంతకుముందు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు నేతలు రావత్‌ దంపతుల భౌతికకాయాలకు నివాళులర్పించారు. కామరాజ్‌ మార్గ్‌ నుంచి కంటోన్మెంట్‌ బ్రార్‌ స్క్వేర్‌ క్రిమటోరియం వరకు అంతిమయాత్ర జరుగుతుంది.బిపిన్‌ రావత్‌ అంత్యక్రియలకు కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సహా పలువురు ప్రముఖులు హాజరవుతారు. ఇక శ్రీలంక, నేపాల్‌, భూటాన్‌ ఆర్మీ అధికారులు కూడా రావత్‌ అంత్యక్రియలకు హాజరవుతారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img