Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

బీజేపీ దొంగాట

తెలుగు రాష్ట్రాలలో మైండ్‌గేమ్‌

విశాలాంధ్రబ్యూరో-అమరావతి: తెలుగు రాష్ట్రాలపై బీజేపీ కన్నుపడిరది. తెలంగాణలో అధికారంలోకి రావాలని, ఆంధ్రప్రదేశ్‌లో కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకోవాలని కలలు కంటోంది. ప్రధాన ప్రాంతీయ పార్టీల బలహీనతల్ని ఆసరా చేసుకుని రాజకీయ కుయుక్తులకు పాల్పడుతోంది. రానున్న ఎన్నికల్లో ఏ అవకాశం వదులు కోకుండా అధికారమే లక్ష్యంగా బీజేపీ అధినాయకత్వం ‘మైండ్‌ గేమ్‌’ ఆడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైనా పట్టు చిక్కించుకోవాలని చూస్తున్న కాషాయ పార్టీ… ఇటీవల రెండు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను మార్చింది. ఏపీలో సోము వీర్రాజు స్థానంలో కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి పార్టీ పగ్గాలు అప్పగించింది. తెలంగాణలో బండి సంజయ్‌ను తొలగించి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని అధ్యక్షుడిగా నియమించింది. ఏపీలో ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరిని వ్యూహాత్మకంగా నియమించింది. అటు వైసీపీతోను, ఇటు టీడీపీతోనూ బీజేపీ నాటకాలాడుతోంది. ఏపీ ప్రభుత్వానికి ఇటీవల కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. ఈ నాలుగేళ్లపాటు కేంద్రం మౌనంగా ఉండి…ఇప్పుడు నిధులు విడుదల చేయడం వెనుక సీట్లు, ఓట్ల రాజకీయమేనని ప్రచారం జరుగుతోంది.
ఎన్టీఏ భేటీకి పవన్‌
దిల్లీలో మంగళవారం జరిగే ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశానికి జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌ హాజరుకానున్నారు. ఈ సమావేశానికి ఆహ్వానం అందించినట్లు జనసేన వెల్లడిరచింది. ఈ భేటీకి సంబంధించి బీజేపీ నుంచి టీడీపీకి ఆహ్వానం అందలేదని తెలిసింది. ఇటీవల దిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్‌షాను చంద్రబాబు కలిశారు. ఆ తర్వాత సీఎం జగన్‌ ప్రధాని మోదీ, అమిత్‌షాతో సమావేశమయ్యారు. ఆయా సందర్భాల్లో ఎన్డీఏ కూటమిలో చేరికపై జగన్‌తో మోదీ, అమిత్‌షా చర్చించగా…జగన్‌ విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. మొదటి నుంచి జగన్‌ ఎన్డీఏ కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులకు మాత్రం సహకరిస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా కేంద్రం నుంచి నిధులు రాబట్టడం, అప్పులకు అనుమతులు పొందడం చేస్తున్నారు. టీడీపీ మాత్రం బీజేపీతో కలిస్తే ముస్లిం, మైనార్టీల ఓట్లు కోల్పోతామన్న ఆందోళనతో ఉంది. దీంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీతో పొత్తులపై టీడీపీ మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తులుంటాయని ఆయా పార్టీల నేతలు సూత్రప్రాయంగా ప్రకటనలు చేస్తున్నారు. అయినా బీజేపీ… ఎన్డీఏ భేటీ కోసం జనసేనకు ఆహ్వానం పంపి… టీడీపీని విస్మరించింది. ఈ తాజా పరిణామాల ప్రకారం వచ్చే ఎన్నికల్లో టీడీపీని దెబ్బతీయడానికి బీజేపీ, జనసేన కలిసి బరిలో దిగే వ్యూహం కనిపిస్తోంది.
విభజన హామీల అమలేది?
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా మొండిచేయి చూపింది. విశాఖ స్టీలు ఫ్యాక్టరీని కారుచౌకగా ప్రైవేటుపరం చేసే ప్రయత్నం కొనసాగిస్తోంది. కడప స్టీలు ప్లాంట్‌ నిర్మాణంపైనా నోరు విప్పడం లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి, నిర్వాసితుల పునరావాసం కోసం పూర్తిస్థాయి నిధులు విడుదల చేయడం లేదు. కేంద్ర విద్యాసంస్థల బలోపేతానికి చర్యలు తీసుకోలేదు. ఇవన్నీ చర్చకు రాకుండా బీజేపీ రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి తెరతీసింది. వీటన్నింటినీ జనసేన మరచి బీజేపీతో జతకట్టడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తే పవన్‌కు తగిన బుద్ధిచెబుతామని హెచ్చరిస్తు న్నారు. రాష్ట్ర భవిష్యత్తుపైన, సమస్యలపైన ఎన్డీఏ సమావేశంలో చర్చించేందుకు దిల్లీ వెళ్తున్నట్లు జనసేన నేతలు చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img