Friday, December 2, 2022
Friday, December 2, 2022

బీజేపీ బలాన్ని తగ్గించాం

భవిష్యత్‌లో ఓడిస్తాం: అఖిలేశ్‌
లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ శుక్రవారం స్పందించారు. గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఎస్‌పీని రెండున్నర రెట్లు అధిక సీట్లతో గెలిపించిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. యూపీలో బీజేపీని అధికారానికి దూరం చేయడంలో విఫలమైనప్పటికీ కాషాయ పార్టీని ఓడిరచే సత్తా ఉందని నిరూపించామని అఖిలేశ్‌ అన్నారు. ‘అత్యధిక సీట్లలో గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. బీజేపీ సీట్ల సంఖ్యను తగ్గించవచ్చని మేము చూపించాం’ అని అఖిలేశ్‌ ట్వీట్‌ చేశారు. ‘బీజేపీ సీట్ల సంఖ్యను తగ్గించడం కొనసాగిస్తాం. బీజేపీని ఓడిరచడం కష్టం కాదని రుజువు చేశాం. బీజేపీని ఓడిరచలేమన్న అనుమానాలను ప్రజల నుంచి దూరం చేశాం. కొద్ది రోజుల్లోనే బీజేపీని పూర్తిగా మట్టు పెడతాం. బీజేపీపై మా పోరాటం కొనసాగుతుంది’ అని అఖిలేశ్‌ స్పష్టం చేశారు. ఎస్‌పీ కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలందరికీ అభినందనలు తెలిపారు. ‘ఎమ్మెల్యేలు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. బాధ్యతతో ప్రజలకు సేవ చేద్దాం. సాయపడదాం. ప్రతి విద్యార్థి, నిరుద్యోగి, ఉపాధ్యాయుడు, మహిళ, పాత పెన్షన్‌వ్యవస్థ మద్దతుదారు, రైతు, కార్మికుడు, వృత్తి నిపుణులకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత గల రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపై గురువారం ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మీడియాకు దూరంగా ఉన్నారు. ఎన్నికల ఫలితాలపై అఖిలేశ్‌ సమీక్ష చేస్తారని పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి చెప్పారు. కర్హాల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అఖిలేశ్‌ మొదటిసారి 67,504 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి కేంద్రమంత్రి ఎస్‌పీ సింగ్‌ బాఘెల్‌ను అఖిలేశ్‌ ఓడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img