Monday, September 26, 2022
Monday, September 26, 2022

బీహార్‌ సీఎంగా నితీశ్‌

ఉప ముఖ్యమంత్రిగా తేజస్వీయాదవ్‌ ప్రమాణం
త్వరలో కేబినెట్‌ విస్తరణ

పాట్నా: బీహార్‌లో కొత్త ప్రభుత్వ కొలువుదీరింది. బీజేపీ నేతృత్వ ఎన్డీయే కూటమితో తెగతెంపులు చేసుకొని ఆర్జేడీ నాయకత్వాన గల ‘మహాకూటమి’తో జతకట్టిన తర్వాత బీహార్‌ నూతన ముఖ్యమంత్రిగా జేడీ(యూ) అధ్యక్షుడు నితీశ్‌ కుమార్‌ ఎనిమిదవసారి ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఉపముఖ్యమంత్రిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ప్రమాణం చేశారు. గవర్నర్‌ ఫాగు చౌహాన్‌ నితీశ్‌తో ప్రమాణం చేయించారు. 2015లో మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నితీశ్‌, తేజస్వీ ప్రమాణ స్వీకారం చేశారు. 2017లో నితీశ్‌ కుమార్‌ బీజేపీతో జతకట్టడంతో మహాకూటమితో సంబంధాలు బీటలు వారాయి. ఒకట్రెండు రోజుల్లో కేబినెట్‌ మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని ఆర్జేడీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు. ప్రమాణ స్వీకారోత్సవానికి తేజస్వీ యాదవ్‌ కుటుంబంతో పాటు మహాకూటమిలోని ఏడు పార్టీల నేతలు హాజరయ్యారు. అనంతరం నితీశ్‌ కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ 2024లో ముఖ్యమంత్రి, ప్రధాని రేసులో ఉండనేమోనని చెప్పారు. బీహార్‌ ప్రజల సేవకే అంకితమవుతానన్నారు. ‘ఏం జరుగుతోందో తెలియదుగానీ 2024లో నేను మాత్రం పదవిలో ఉండనన్నది కచ్చితంగా చెప్పగలను’ అని ఆయన చెప్పారు. 2024లో ప్రతిపక్ష పార్టీల ఐక్యతకు పిలుపునిచ్చారు. ప్రధానిమోదీ గురించి ఓ ప్రశ్నకు సమాధానంగా ‘2014లో పధానమంత్రి అయ్యారుగానీ 2024లో ఆ పదవిని అధిష్ఠిస్తారో లేదో సమయమే చెబుతుంది’ అని నితీశ్‌ వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రస్తుత ప్రధాని మోదీకి మధ్య తేడా ఏమిటన్న ప్రశ్నకు ‘వాజ్‌పేయి మాకు మరువలేనంత ప్రేమానురాగాలు, ఆప్యాయత, గౌవరం ఇచ్చారు. నేడు పరిస్థితులు మారిపోయాయి’ అని బదులిచ్చారు. బీజేపీతో తెగతెంపులపై ఓ విలేకరి ప్రశ్నించగా ‘అలా ఎందుకు జరిగిందో మీకు తెలుసు. నెలన్నరగా మీరెవ్వరితో నేను మాట్లాడలేదు. మా పార్టీవారు అన్ని విషయాలు చెబుతారు’ అని అన్నారు. 2020లో ముఖ్యమంత్రి కావాలని అనుకోలేదని, అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో పదవీ బాధ్యతలు స్వీకరించానని గుర్తుచేశారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(యూ) 70 సీట్లు గెలుచుకోగా 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 43కు పరిమితం కావడాన్ని ప్రస్తావించారు. అప్పట్లో చాలా విషయాలు జరిగాయని, అందుకే బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని జేడీ(యూ) నాయకులు నిర్ణయించారని నితీశ్‌ తెలిపారు.
కొత్త మంత్రివర్గంపై ఊహాగానాలు
ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌, లాలూ పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌తో కలిపి కొత్త కేబినెట్‌లో 16 మంది ఉంటారని తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి అలోక్‌ మెహతా, లలిత్‌ యాదవ్‌, అనితా దేవి, కుమార్‌ సర్వజిత్‌, భాయి వీరేంద్ర, సురేంద్ర రామ్‌, వీణా సింగ్‌ మంత్రివర్గంలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. జేడీ(యూ) నుంచి 13 మంది.. విజయ్‌ చౌదరి, అశోక్‌ చౌదరి, విజేంద్ర యాదవ్‌, సంజయ్‌ రaా, ఉపేంద్ర కుష్వాహా, శ్రవణ్‌ కుమార్‌, జమా ఖాన్‌ కొత్త మంత్రులుగా ప్రమాణం చేస్తారని పార్టీ వర్గాల సమాచారం. మహాకూటమిలో భాగమైన కాంగ్రెస్‌ నుంచి మదన్‌ మోహన్‌ రaా, అజిత్‌ శర్మ, షకీల్‌ అహ్మద్‌ ఖాన్‌, రాజేశ్‌ కుమార్‌ రామ్‌కు కేబినెట్‌ స్థానాలు దక్కవచ్చని తెలుస్తోంది. హిందుస్థానీ అవామ్‌ మోర్చా (సెక్యూలర్‌) పార్టీ నేత జితన్‌ రామ్‌ మాంరీaకీ బెర్త్‌ ఖరారైనట్లు తెలిసింది. కొత్త ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతిస్తున్నాయని, వారు నూతన ప్రభుత్వంలో భాగస్వాములు కాకపోవచ్చని ఆర్జేడీ సీనియర్‌ నేత అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img