Monday, October 3, 2022
Monday, October 3, 2022

బీహార్‌ సీఎం నితిష్‌ కుమార్‌ రాజీనామా

బీహార్‌ ముఖ్య మంత్రి పదవికి నితిష్‌ కుమార్‌ రాజీనామా చేశారు. మంగళవారం గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని అందించారు. పార్టీలోని అందరి ఆకాంక్ష మేరకు ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్నట్టు నితిష్‌ కుమార్‌ వెల్లడిరచారు. ఇక ఆర్జేడీతో కలసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. దీనికోసం ఇప్పటికే రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమితో నితిష్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే తాజాగా ఎన్‌డీఏకు గుడ్‌ బై చెప్పేశారు. తన పార్టీని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు నితిష్‌ కుమార్‌ అనుమానించారు. ఆ క్రమంలో బీజేపీ నుంచి దూరంగా అడుగులు వేస్తూ వచ్చారు. ఇందులో భాగంగానే ఇటీవల కేంద్రం ఏర్పాటు చేసిన సమావేశాలకు కూడా ఆయన హాజరు కాలేదు. ఇంతలో తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ ఎన్డీయేతో పొత్తును వదిలేస్తున్నట్టు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img