Monday, February 6, 2023
Monday, February 6, 2023

బూస్టర్‌గా కోవావాక్స్‌.. మరో 15 రోజుల్లో ఆమోదం

కోవావాక్స్‌ టీకాకు బూస్టర్‌ డోసుగా మరో 15 రోజుల్లో ఆమోదం లభించనున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో ఆదార్‌ పూనావాలా తెలిపారు. కోవావాక్స్‌ టీకా కరోనాకు చెందిన ఒమిక్రాన్‌ వేరియంట్‌పై కూడా ప్రభావంతంగా పనిచేయనున్నట్లు ఆయన వెల్లడిరచారు. భారతి విద్యాపీఠ్‌ యూనివర్సిటీ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వద్ద కోవీషీల్డ్‌ టీకాల స్టాక్‌ ఉందని స్పష్టం చేశారు. అయితే కోవీషీల్డ్‌ కన్నా.. కోవావాక్స్‌ బెస్ట్‌ బూస్టర్‌గా పనిచేస్తుందని పూనావాలా తెలిపారు. ప్రపంచదేశాలన్నీ ఇండియా వైపే చూస్తున్నాయని, హెల్త్‌కేర్‌ అంశంలో భారీ జనాభా ఉన్న మన దేశం ఎలా జాగ్రత్తలు తీసుకున్నదో గమనిస్తున్నారని, కోవిడ్‌ వేళ ఇండియా 80 దేశాలకు సాయం కూడా చేసిందని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img