Friday, March 24, 2023
Friday, March 24, 2023

భారత్‌కు చేసిన వాగ్దానం నెరవేరింది

. ‘భారత్‌ జోడో యాత్ర’లో రాహుల్‌ గాంధీ
. శ్రీనగర్‌ లాల్‌ చౌక్‌ వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ
. నేడు పాదయాత్ర ముగింపు… 23 ప్రతిపక్ష పార్టీలతో సభ

శ్రీనగర్‌ : భారతదేశానికి చేసిన ‘వాగ్దానం’ నెరవేరిందని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ అన్నారు. కన్యాకుమారి-కశ్మీర్‌ ‘భారత్‌ జోడో యాత్ర’లో భాగంగా శ్రీనగర్‌ నడిబొడ్డున లాల్‌ చౌక్‌లోని చారిత్రాత్మక క్లాక్‌ టవర్‌ వద్ద ఆదివారం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాహుల్‌ చేప ట్టిన పాదయాత్ర ముగింపు దశకు చేరింది. గాంధీ, తన సోదరి, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జమ్ముకశ్మీర్‌లోని యాత్ర చివరి ప్రాంతమైన శ్రీనగర్‌లోని పంథా చౌక్‌ నుంచి ఉదయం 10:45 గంటలకు తిరిగి ప్రారంభించారు. యాత్రలో పాల్గొన్న వారు ‘జోడో జోడో భారత్‌ జోడో’ వంటి నినాదాలు చేస్తూ సోన్వార్‌ వరకు సుమారు ఎనిమిది కిలోమీటర్లు నడిచారు. దారి పొడవునా స్థానికులు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. బహుళ భద్రతా వలయంలో రాహుల్‌ భారతదేశం దక్షిణ కొన నుంచి 4 వేల కిలోమీటర్ల యాత్రలో చాలా వరకు తెల్లటి టీ-షర్టులో, త్రివర్ణ పతాకాన్ని మోసు కెళ్లే పెద్ద సంఖ్యలో మహిళలతో సహా యాత్రికు లుగా ప్రజలను కదిలించారు. కాంగ్రెస్‌ జెండాలు, సోన్వార్‌ వైపు కదిలాయి. వారి గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత, గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర పార్టీ సీనియర్‌ నాయకులు ఇక్కడ ఎంఏ రోడ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. తరువాత, వారు లాల్‌ చౌక్‌కు వెళ్లారు. అక్కడ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ‘లాల్‌ చౌక్‌ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా భారతదేశానికి చేసిన వాగ్దానం ఈ రోజు నెరవేరింది. ద్వేషం ఓడిపోతుంది. ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది. భారత్‌లో కొత్త ఆశలు చిగురిస్తాయి’ అని ఈ కార్యక్రమం అనంతరం గాంధీ హిందీలో ట్వీట్‌ చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌ 7న కన్యాకుమారిలో ప్రారంభించిన ఈ యాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పర్యటించింది. సోమవారం కాంగ్రెస్‌ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేయడంతో ఇది ముగుస్తుంది. గాంధీ నేతృత్వంలోని పాదయాత్ర యాత్రికులు ఇక్కడి నెహ్రూ పార్కు వద్ద రాత్రికి బస చేస్తారు. సోమవారం ఎస్‌కే స్టేడియంలో బహిరంగ సభ కూడా జరగనుంది. దీనికి కాంగ్రెస్‌ 23 ప్రతిపక్ష రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. అంతకుముందు రోజు, ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ జనరల్‌ సెక్రటరీ, కమ్యూనికేషన్స్‌ ఇన్‌చార్జ్‌ జైరాం రమేశ్‌ ట్విట్టర్‌లో జెండా ఆవిష్కరణను సోమవారమే నిర్వహించాలని అనుకున్నారని, అయితే ఒక రోజు ముందుగానే చేయవలసి వచ్చిందని పేర్కొన్నారు. ప్రాముఖ్యత కలిగిన చౌక్‌కు దారితీసే ఒక కిలోమీటరు మేర అన్ని రహదారులు శనివారం రాత్రి నుంచి మూసివేశారు. వాహనాల రాకపోకలను అనుమతించనందున 10 నిమిషాల ఈ కార్యక్రమానికి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా దుకాణాలు, వ్యాపార సంస్థలు, వారపు మార్కెట్‌ను మూసివేయగా, భద్రతా సిబ్బంది భారీ మోహరింపుతో అన్ని ప్రవేశ మార్గాల వద్ద బారికేడ్లు, కంచెలను ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img