Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 13, 2024
Friday, September 13, 2024

భారత్‌`చైనా సరిహద్దు పరిస్థితులపై నోరు మెదపరేం?

ప్రధానిని ప్రశ్నించిన సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా

కోయంబత్తూర్‌ : భారత్‌చైనా సరిహద్దు వద్ద చోటుచేసుకునే తాజా పరిణామాలను దేశ ప్రజలకు ప్రధాని మోదీ వెల్లడిరచాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శి డి.రాజా డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, రెండు దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి చర్చలు కొనసాగాలని సూచించారు. లఢక్‌లోని ప్యాంగాంగ్‌ సరస్సు వద్ద కొత్త వంతెనను చైనా నిర్మిస్తున్నదన్న వార్తల నేపథ్యంలో డి.రాజా స్పందించారు. సరిహద్దు వివాదాల పరిష్కారం కోసం రక్షణ, మంత్రుల స్థాయిలో చర్చలు జరుపుతున్నారని తెలిపారు. ఇరుగుపొరుగు దేశాలుగా తమ మధ్య సమస్యల పరిష్కారానికి రెండు వైపుల నుంచి చర్యలు ఉండాలని సూచించారు. మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిసి గాల్వాన్‌ లోయలో భారత్‌, చైనా మధ్య ఘర్షణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారని డి.రాజా తెలిపారు. సమస్య గురించి మోదీ మాట్లాడటం లేదనీ, ప్రస్తుతం సరిహద్దుల వెంబడి ఏం జరుగుతోందో తెలపాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. ఈ నెల 26 నుంచి కోయంబత్తూర్‌లో సీపీఐ జాతీయ సమితి సమావేశాలు మూడ్రోజులు జరుగుతాయని, దేశంలోని తాజా పరిణామాలు, రాజకీయ పరిస్థితి, ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చిస్తామని డి.రాజా వెల్లడిరచారు. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఫాసిస్టు మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ వర్గంగా బీజేపీ వ్యవహరిస్తూ దాని అజెండా అమలు కోసం పనిచేస్తోందని విమర్శించారు. అన్ని లౌకిక, ప్రజాస్వామ్య, ఫాసిస్టు వ్యతిరేక శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అప్పుడే మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించగలుగుతామని డి.రాజా నొక్కిచెప్పారు. ఒకే మతం, కులం, భాష కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కోయంబత్తూరులోని విద్యాసంస్థల ఆవరణల్లో ‘శాఖ’లను నిర్వహిస్తూ యువతను హింసకు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రేరేపిస్తోందని తెలుస్తోందని రాజా చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img