Tuesday, September 27, 2022
Tuesday, September 27, 2022

మనీష్‌ సిసోడియా బ్యాంకు లాకర్లలో సీబీఐ సోదాలు

సీబీఐ దాడుల్లో తన బ్యాంక్‌ లాకర్‌లో ఏమీ గుర్తించలేదని దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా వ్యాఖ్యానించారు. తనకు క్లీన్‌చిట్‌ లభించడం పట్ల సంతోషంగా ఉందని అన్నారు. సీబీఐ అధికారులకు తాము పూర్తిగా సహకరించామని, వారు కూడా తమను బాగా చూసుకున్నారని చెప్పుకొచ్చారు. సత్యం గెలిచిందని సిసోడియా వ్యాఖ్యానించారు. సీబీఐ అధికారులు మంగళవారం ఘజియాబాద్‌లోని పీఎన్‌బీ బ్రాంచ్‌లో మనీష్‌ సిసోడియా బ్యాంక్‌ లాకర్లలో సోదాలు నిర్వహించారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని సిసోడియా ఈ సందర్భంగా అన్నారు. సత్యం గెలిచిందని, తాను పైసా కూడా అవకతవకలకు పాల్పడలేదని పేర్కొన్నారు. మరోవైపు ఢల్లీి అసెంబ్లీలో అవినీతి ఆరోపణలపై బీజేపీ, ఆప్‌ సభ్యుల మధ్య డైలాగ్‌ వార్‌ ముదిరింది. అవినీతి ఆరోపణలపై ఢల్లీి ఎల్‌జీ వీకే సక్సేనా రాజీనామా చేయాలని ఆప్‌ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలను కొనసాగించేలా సభ్యులు సహకరించాలని డిప్యూటీ స్పీకర్‌ కోరినా గందరగోళం నెలకొంది. ఎల్‌జీ అవినీతిపై తాము దర్యాప్తునకు పట్టుబడుతుంటే విపక్ష నేతలు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ఆప్‌ ప్రతినిధి సౌరవ్‌ భరద్వాజ్‌ బీజేపీ సభ్యులను నిలదీశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img