Friday, March 31, 2023
Friday, March 31, 2023

మన మిస్సైల్‌ వ్యవస్థ అత్యంత సురక్షితమైంది

… ఆ ఘటన ప్రమాదవశాత్తు జరిగింది: రాజ్‌నాథ్‌
పాకిస్థాన్‌లో పడిన మిస్సైల్‌కు సంబంధించి ్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇవాళ ప్రకటన చేశారు. ఈనెల 9న మన దేశానికి చెందిన మిస్సైల్‌ ఒకటి పాకిస్థాన్‌లో పడినట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు మిస్సైల్‌ ఫైర్‌ అయ్యిందని, అయితే అది కాస్త పాకిస్థాన్‌లో పడినట్లు గుర్తించామన్నారు. అదృష్టవశాత్తు ఎటువంటి నష్టం జరగలేదన్నారు. రొటీన్‌గా జరిగే తనిఖీ సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. అదృష్టవశాత్తు ఎటువంటి నష్టం జరగలేదన్నారు. ఈ ఘటన పట్ల అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు మంత్రి రాజ్‌నాథ్‌ తెలిపారు. తమ ప్రభుత్వం వెపన్‌ సిస్టమ్‌కు సర్వోన్నత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మన మిస్సైల్‌ వ్యవస్థ అత్యంత సురక్షితమైందని, నమ్మదగినదని మంత్రి సభకు హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img