Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

మరింత అప్రమత్తంగా ఉండాలి

రాష్ట్రాలకు కేంద్రం కరోనా హెచ్చరిక లేఖ
వచ్చే నెల పండుగ సీజన్‌ కావడంతో కేంద్రం మరింత అప్రమత్తమయ్యింది. కరోనా విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది.వైరస్‌ ఉధృతిని అదుపు చేయడంపై దృష్టి పెట్టాలని కోరింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. కొన్ని రాష్ట్రాల్లో వైరస్‌ వ్యాప్తి రేటు ఎక్కువగా, మరికొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉందని లేఖలో పేర్కొన్నారు. జిల్లాల వారీగా పాజిటివిటీ రేటును పరిగణలోకి తీసుకుని, రాష్ట్రాలు వైరస్‌ను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.ప్రజలంతా కరోనా ప్రొటోకాల్‌ పాటించేలా చూడాలని, టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్మెంట్‌, వ్యాక్సినేషన్‌ మొదలైన విషయాల్లో అధికారులు చురుకుగా వ్యవహరించాలని లేఖలో ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img