Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

మరోసారి భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. రూ.50 వడ్డింపు

చమురుసంస్థలు శనివారం ఉదయాన్నే షాకింగ్‌ న్యూస్‌ చెప్పాయి. ఈ నెల 1న కమర్షియల్‌ సిలిండర్‌ ధరలు పెంచిన ప్రభుత్వం.. ఈసారి గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌పై వడ్డించింది. గృహ వినియోగ గ్యాస్‌ 14.2 కేజీల సిలిండర్‌ ధర రూ. 50 పెంచుతూ దేశీయ ఇంధన కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,052కు చేరింది. పెంచిన ధరలు నేటినుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. గృహావసరాలకు వినియోగించే సిలిండర్‌ ధరను మార్చి 22న పెంచిన విషయం తెలిసిందే. ఈ నెల 1న కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరను భారీగా పెంచిన విషయం తెలిసిందే. 19 కిలోల సిలిండర్‌పై ఒకేసారి రూ.250 వడ్డించాయి. దీంతో సిలిండర్‌ ధర రూ.2460కు పెరిగింది. వారం రోజుల వ్యవధిలోనే గ్యాస్‌ సిలిండర్‌ ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img