Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

మరో వారంపాటు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు


ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూను మరో వారంపాటు ప్రభుత్వం పొడిగించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులపై సమీక్షించిన సీఎం జగన్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్కరు కరోనా నింధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్రవ్యాప్తంగా సమర్థ నిర్వహణ ద్వారా 11 లక్షల డోసులను ఆదా చేయగలిగనట్లు తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో నిర్మించదలచిన పీడియాట్రిక్‌ సూపర్‌ కేర్‌ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలని సూచించారు. పోలీస్‌ బెటాలియన్స్‌లో కూడా కోవిడ్‌ కేర్‌ ఎక్విప్‌మెంట్‌ ఏర్పాటుతో పాటు వైద్యులను నియమించాలని, కమ్యూనిటీ ఆస్పత్రులు స్ధాయివరకు ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీహెచ్‌సీల్లో కూడా ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉంచాలని, సబ్‌సెంటర్ల వరకు టెలీమెడిసిన్‌ సేవలు, ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img