Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 10, 2024
Tuesday, September 10, 2024

మళ్లీ చీపురుపట్టిన ప్రియాంక

ఇది ఆత్మగౌరవ చర్యన్న కాంగ్రెస్‌ నేత
దళిత పరిసరాలను ఊడ్చి యోగి ‘కుల’ వ్యాఖ్యలకు నిరసన
న్యూదిల్లీ :
కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా శుక్రవారం లక్నోలోని దళిత కాలనీని సందర్శించారు. చీపురుపట్టి అక్కడి పరిసరాలను ఊడ్చారు. ఇది ఆత్మగౌరవ చర్య అని అన్నారు. లఖింపూర్‌ ఖేరి బాధితులను పరామర్శించేందుకు లక్నోకు వెళ్లిన ఆమెను అడ్డుకొని సీతాపూర్‌ అతిథిగృహంలో నిర్బంధించగా అందుకు నిరసనగా తనను ఉంచిన గదిని ప్రియూంక ఊడ్చారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిరచారు. ఆయన ఓ కులాన్ని కించపరిచారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా పార్టీకి చెందిన అన్ని జిల్లాల కమిటీలు శనివారం వాల్మిక్కి ఆలయాలన్నింటినీ శుభ్రపరుస్తారని ప్రియాంక ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. తన వ్యాఖ్యల ద్వారా యోగి తన దళితవ్యతిరేకతను బయట పెట్టుకున్నారన్నారు. మహిళలు, కోట్లాది మంది దళితులను అవమానిస్తే భారత్‌ ఊరుకోదని హెచ్చరించారు. సీఎం తీరుకు నిరసనగా శనివారం వాల్మిక్కి ఆలయాన్నింటిని కాంగ్రెస్‌ కమిటీలు శుభ్రం చేస్తాయని పేర్కొన్న ట్వీట్‌నకు దళిత కాలనీని తాను ఊడ్చిన వీడియోను జతపరిచారు. ‘చీపురుపట్టుకొని ఊడవటమే ఇక ప్రియాంకకు మిగిలింది. ప్రజలు కూడా ఆమెను అలానే చూడాలని అనుకుంటున్నారు’ అని యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యానించారు. వీళ్లకు రాద్ధాంతం చేయడం తప్ప మరే పని లేదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియాంక శుక్రవారం దళిత కాలనీని ఊడ్చారు. చీపురు పట్టడం ఆత్మగౌరవానికి ప్రతీకన్నారు. స్థానిక మహర్షి వాల్మికి ఆలయ పరిసరాలను శుభ్రపరిచిన ఆమె స్థానిక లవ్‌కుశ్‌ నగర్‌ వాస్తవ్యులతో మాట్లాడారు. అదే ఆలయంలో ఆమె పూజ కూడా చేశారు. దేశంలోని కోట్లాడి మంది పారిశుద్ధ్య కార్మికులు రోజు చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేస్తున్నారని ఆమె అన్నారు. ఇటువంటి వ్యాఖ్యల ద్వారా యోగి ఆదిత్యనాథ్‌ కేవలం తననే కాకుండా కోట్లాది మంది దళిత సోదర, సోదరీమణులను, సఫాయి కర్మచారీల (పారిశుద్ధ్య కార్మికులు)ను అవమానించారని ప్రియాంక అన్నారు.‘ మీ అందరితో కలిసి పారిశుద్ధ్య పనుల్లో భాగస్వామ్యం కావాలనే వచ్చారు. తద్వారా చీపురు పట్టడం నిరాడంబరతకు ఆత్మగౌరవానికి ప్రతీక అని యోగికి తెలియజెప్పాలని అనుకున్నాను’ అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ప్రియాంక ఇదంతా కేవలం కాంగ్రెస్‌ పార్టీ పునర్జీవం కోసం చేస్తున్నారని, ఇలాంటి స్టంట్లు మానుకొని దళితుల సమస్యల పరిష్కారంపై ఆపార్టీ దృష్టిపెట్టాలని బీజేపీ యూపీ ఉపాధ్యక్షుడు విజయ్‌ పాథక్‌ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img