Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

మళ్లీ టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : శాసనసభ రెండో రోజూ కూడా టీడీపీ సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. ‘దివాలా బడ్జెట్‌.. జగన్‌ రెడ్డి కళకళ.. ప్రజలు గిలగిల’ అని బ్యానర్‌తో టీడీపీ సభ్యులు అసెంబ్లీ వెలుపల ఆందోళన చేపట్టారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలో స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి నిరసన తెలిపారు. దీనిపై సీఎం జగన్‌తో పాటు శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ బడ్జెట్‌ను అడ్డుకోవడం తగదన్నారు. ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలన్నారు. కానీ టీడీపీ సభ్యులు నినాదాలు కొనసాగించారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడిరది. బడ్జెట్‌ ప్రసంగానికి అవరోధం కలిగించినందుకు టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేయాలని స్పీకర్‌కు సీఎం సిఫార్సు చేయగా 14 మంది సభ్యులను ఒకరోజు కోసం స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా నిరసనలో పాల్గొన్నారు. ‘ఏపీలో దివాలా బడ్జెట్‌, జగన్‌ రెడ్డి కళకళ, ప్రజలు గిలగిల’ అన్న ప్లకార్డుతో బాలకృష్ణ నిరసన తెలిపారు. అసెంబ్లీ లాబీల్లో బాలకృష్ణను మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, అమర్నాథ్‌ పలకరించారు. ‘ఏం హీరో గారు’ అంటూ బాలయ్యకు బొత్స అభివాదం చేశారు. ఇవాళ కోటు వేసుకురాలేదేమని అమర్నాథ్‌నుద్దేశించి బాలయ్య చమత్కరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img