Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

మ‌ళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

బంగారం, వెండి ధరలు భయపెడుతున్నాయి. హైదరాబాద్‌లో బంగారం రేటు రికార్డు స్థాయికి చేరింది. ఇవాళ 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.200 పెరిగి రూ.57 వేల 200కు చేరింది. గత మూడు రోజుల్లో తులానికి రూ.1500 పెరిగింది. ఇక 24 క్యారెట్ల పసిడి రేటు హైదారాబాద్‌లో తులానికి రూ.220 పెరిగింది. ప్రస్తుతం రూ.62 వేల 400 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే బంగారం రేటు 22 క్యారెట్లకు రూ.200 పెరిగి రూ.57 వేల 350 వద్ద ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం తులానికి రూ.220 పెరిగి ప్రస్తుతం ఢిల్లీలో రూ.62 వేల 550 పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే బంగారం దారిలోనే పరుగులు పెడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.900 మేర పెరిగి రూ.83 వేల 700కు చేరింది. గడిచిన నాలుగు రోజుల్లోనే కిలోకు ఏకంగా రూ.3500 పెరిగిది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో సిల్వర్ రేటు కిలోకు ఒక్కసారిగా రూ.1150 పెరిగింది. ప్రస్తుతం కిలో రేటు రూ.78 వేల 250 పలుకుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img