Saturday, November 26, 2022
Saturday, November 26, 2022

మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధర

పది రోజుల్లో రూ.13 పెంపు
న్యూదిల్లీ: దేశంలో ఇంధన ధరల పెంపు యధేచ్ఛగా కొనసాగుతోంది. పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌తో పాటు సీఎన్‌జీ ధరలు సైతం నిరాఘాటంగా పెంచుతున్నారు. ఓవైపు ప్రజలు, ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నా మోదీ సర్కారు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా సీఎన్‌జీ ధరను కిలోకు రూ.2.50 గురువారం పెంచారు. గడచిన నెలరోజుల్లో సీఎన్‌జీ ధర పెంచడం ఇది పదోసారి. దీంతో దిల్లీలో సీఎన్‌జీ ధర కిలో రూ.69.11కి పెరిగింది. ఇంద్రప్రస్థ గ్యాస్‌ లిమిటెడ్‌(ఐజీఎల్‌) ఈ మేరకు వెబ్‌సైట్‌ ద్వారా సమాచారం విడుదల చేసింది. నిన్న కూడా సీఎన్‌జీపై రూ.2.50 పెంచింది. మొత్తం మీద గడచిన నెలరోజుల్లో సీఎన్‌జీ ధర కిలోకు రూ.13.1కి పెరిగింది. గడచిన ఏడాదిగా సీఎన్‌జీ ధర రూ.25.71 లేదా 60శాతం పెరిగింది. పైప్‌డ్‌ కుకింగ్‌ గ్యాస్‌(పీఎన్‌జీ) ధరను మాత్రం గురువారం పెంచలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img