Thursday, December 8, 2022
Thursday, December 8, 2022

మళ్లీ ప్రారంభమైన వాట్సాప్‌ సేవలు

దాదాపు రెండు గంటల సేపు నిలిచిపోయిన వాట్సాప్‌ సేవలు
గందరగోళానికి గురైన కోట్లాది మంది యూజర్లు
సమస్య ఏమిటో ఇంకా వెల్లడిరచని వాట్సాప్‌

ప్రపంచ ప్రఖ్యాత మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ సేవలు పునఃప్రారంభమయ్యాయి. ఇండియాతో పాటు ప్రపంచంలోని పలు చోట్ల వాట్సాప్‌ సేవలకు అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు గంటల పాటు సర్వీసులు ఆగిపోయాయి. మెసేజీల సెండిరగ్‌, రిసీవింగ్‌ నిలిచిపోయాయి. కనీసం డెలివరీ స్టేటస్‌ కూడా కనిపించలేదు. దీంతో, కోట్లాది మంది యూజర్లు గందరగోళానికి గురయ్యారు. ప్రతి దానికి వాట్సాప్‌ మీదే ఆధారపడి ఉండటంతో… ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి చాలా మంది వెళ్లిపోయారు. అయితే, ఈ సమస్యపై వర్క్‌ చేసిన వాట్సాప్‌ టెక్నికల్‌ టీమ్‌ సమస్యను పరిష్కరించింది. సర్వీసులను పునరుద్ధరించింది. మరోవైపు, సమస్య ఏమిటనేది వాట్సాప్‌ ఇంకా వెల్లడిరచలేదు. కాసేపట్లో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడిరచే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img