Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

మళ్లీ భయపెడుతున్నకోవిడ్‌

పెరిగిన మరణాలు
కొత్తగా 38,628 కేసులు
617 మంది మృతి

న్యూదిల్లీ : దేశంలో కోవిడ్‌ రెండవ దశ జోరు తగ్గడం లేదు. కేసులు తగ్గినట్టే తగ్గి మరలా పుంజుకోగా మరణాల్లోనూ పెరుగుదల నమోదు అవుతోంది. 24 గంటల్లో 2,006 కేసులు తక్కువగా నమోదు కాగా తాజాగా 38,528 మంది కోవిడ్‌ బారిన పడ్డారు. అలాగే 617 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 4,27,371 మంది మరణించారని, కేసుల సంఖ్య 3,18,95,385కి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం పేర్కొంది. క్రియాశీల కేసులు మొత్తం ఇన్ఫెక్షన్లలో 1.29 శాతంగా అంటే 4,12,153గా ఉన్నట్లు తెలిపింది. రికవరీ రేటు 97.37శాతానికి చేరిందని, మొత్తం 3,10,55,861 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారని తాజా నివేదిక వెల్లడిరచింది. రోజువారీ పాజిటివిటీ రేటు 12 రోజులుగా 3శాతం కంటే తక్కువగా ఉంటూ ప్రస్తుతానికి 2.21శాతంగా నమోదు అయింది. వారాంతపు పాజిటివిటీ రేటు 2.39శాతంగా ఉంది.
శుక్రవారం 17,50,081 నమూనాలను పరీక్షించగా ఇప్పటివరకు మొత్తం 47,83,16,964 కోవిడ్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్రారోగ్యశాఖ పేర్కొంది. తాజా మరణాల్లో 187 చొప్పున మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో నమోదయ్యాయి. మొత్తం 4,27,371 మృతుల్లో 1,33,717 మంది మహారాష్ట్రలో చనిపోగా కర్ణాటకలో 26,741 మంది, తమిళనాడులో 34,260, దిల్లీలో 25,065, ఉత్తరప్రదేశ్‌లో 22,771, పశ్చిమ బెంగాల్‌లో 18,202, కేరళలో 17,515 మంది చొప్పున మరణించారని కేంద్ర

ఆరోగ్యశాఖ వెల్లడిరచింది.
రాష్ట్రాల వద్ద 2.29 కోట్లకుపైగా టీకాలు
అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వాక్సిన్‌ల సంఖ్య 2.29,36,394గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు 51,66,13,680 వాక్సిన్‌లను అందించగా మరో 55,52,070 డోసులు పైప్‌లైన్‌లో ఉన్నట్లు పేర్కొంది. వృథా అయినవి కలిపి వినియోగించిన టీకాల సంఖ్య 49,74,90,815కి చేరినట్లు తాజా నివేదిక వెల్లడిరచింది.
వాక్సినేషన్‌ జోరు : 50 కోట్ల టీకాల పంపిణీ
దేశంలో వాక్సినేషన్‌ 50 కోట్ల మార్కును దాటింది. ఇప్పటివరకు మొత్తం 50,10,09,609 టీకాల పంపిణీ జరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్‌ మాండవియా వెల్లడిరచారు. 24 గంటల్లో 49,55,138 వాక్సిన్‌ డోసులు ఇచ్చినట్లు తెలిపారు. జులైలో 13.45 కోట్ల డోసుల పంపిణీ జరుగగా నిత్యం సగటున 43.41లక్షల టీకాల పంపిణీ జరుగుతోందని ఆయన ట్వీట్‌ చేశారు. మొత్తం 58,08,344 సెషన్లలో 50,10,09,609 వాక్సిన్‌ డోసులు అందించగా 24 గంటల్లో 49,55,138 మోతాదుల పంపిణీ జరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img