Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

మళ్లీ వాయిదా పడిన జగన్ కొవ్వూరు పర్యటన

కొవ్వూరులో వలంటీర్లకు వందనం్ణ కార్యక్రమం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కొవ్వూరు పర్యటన మరోమారు వాయిదా పడింది. గత నెల 14న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ావలంటీర్లకు వందనం్ణ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం రోడ్ షో, భారీ బహిరంగ సభకు అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే, అనుకోని కారణాలతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. తిరిగి ఈ నెల 5న కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు రెండు రోజల క్రితం అధికారులు ప్రకటించారు. దీనికి కూడా ఏర్పాట్లు చేశారు. అయితే, వర్షాల హెచ్చరిక నేపథ్యంలో జగన్ కొవ్వూరు పర్యటన మరోమారు వాయిదా పడినట్టు హోంమంత్రి తానేటి వనిత నిన్న తెలిపారు. ఈ నెల 24న సీఎం కొవ్వూరు పర్యటన ఉంటుందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img