Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

మళ్లీ వెయ్యి కోట్ల అప్పు

7.69 శాతం వడ్డీతో పదేళ్లలో చెల్లింపు
కేంద్రం అనుమతికి మరో రూ.1,557 కోట్లే అవకాశం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ రూ.1,000 కోట్ల అప్పు తెచ్చింది. ఆర్‌బీఐ నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం పాల్గొని సెక్యూరిటీలు అమ్మి రూ.1000 కోట్లు అప్పు తీసుకుంది. ఈ అప్పు రాబోయే పదేళ్లలో 7.69 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంది. కేంద్రం ఇచ్చిన రూ.4,557 కోట్లలో ఇప్పటికే రూ.3వేల కోట్లు ప్రభుత్వం వాడేసింది. మరో రూ.1,557 కోట్లకు మాత్రమే అవకాశం ఉంది. మరోవారం రోజుల్లో మళ్లీ వేతనాలు, పెన్షన్ల కోసం ప్రభుత్వం అప్పుల వేట కొనసాగించాల్సి ఉంది. జీతాలు, పెన్షన్లకు ప్రతి నెలా సుమారు రూ.5,500 కోట్లు అవసరమవుతాయి. వీటిని సమకూర్చుకోవడానికి ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి అప్పులు చేయడంతో సంక్షేమ పథకాల అమలుకు కష్టాలు మొదలయ్యాయి. అన్నిశాఖలకు సంబంధించిన నిధులను నవరత్నాల అమలుకు మళ్లిస్తున్నారు. గత రెండు, మూడు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు 15వ తేదీ వరకు జీతాలు చెల్లి స్తూనే ఉండడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి నిదర్శనంగా పేర్కొన వచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేతలు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసి తమకు ప్రతినెలా 1వ తేదీన జీతాలు వచ్చేలా చూడాలని, ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక ప్రయోజ నాలు సక్రమంగా చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరడం సంచలనమైంది. దీంతో ఎలాగైనా ఈసారి వచ్చే నెల 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని నిరూపించుకోవాలన్న యోచనతో జీతాలు, పెన్షన్లకు అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు అప్పుల కోసం అన్వేషణ కొనసాగిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img