Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

మహారాష్ట్రలో ఘోరం

మైనరుపై ఐదేళ్లుగా అత్యాచారం
తాత, తండ్రీ, సోదరుడే నిందితులు

పూనె: మహారాష్ట్రలోని పూనెలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనరు బాలికపై సొంత తండ్రి, సోదరుడు అత్యాచారానికి పాల్పడ్డారు. వీరితోపాటు తాత, దూరపు బంధువైన బాబాయి అత్యాచారం చేశారు. లైంగికవేధింపులకు పాల్పడ్డారు. వారంతా ఐదేళ్లుగా వేర్వేరుగా ఆ బాలికను శారీరకంగా అనుభవిస్తున్నారని పూనె పోలీసులు శనివారం తెలిపారు. అత్యాచారం, లైంగికవేధింపులకు సంబంధించి నిందితులపై వేర్వేరు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఇంకా నిందితులను అరెస్టు చేయలేదని అధికారులు వెల్లడిరచారు. బాలిక తండ్రి(45), సోదరుడిపై ఐపీసీలోని 376 సెక్షన్‌ కింద కేసు నమోదు చేయగా 60 ఏళ్ల తాత, 25 ఏళ్ల బాబాయిపై 354 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. బాలిక వయసు 11 ఏళ్లు మాత్రమే. బాధితురాలు, ఆమె కుటుంబం బీహారు నుంచి ఇక్కడికి వచ్చి జీవనం సాగిస్తున్నారు. పాఠశాలలో గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ అనే అంశంపై చర్చ సందర్భంగా బాలిక ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. నిందితులు ఐదేళ్లుగా బాలికపై ఈ దారుణానికి పాల్పడుతున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ అశ్వనీ చెప్పారు. బీహారులో ఉండగానే 2017లోనే బాలికపై తండ్రి లైంగికదాడి ప్రారంభించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2020 నవంబరు నుంచి సోదరుడు అత్యాచారం చేస్తున్నాడని, తాత, బాబాయి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. బాలికపై అత్యాచారం, వేధింపులకు సంబంధించి నిందితులకు పరస్పరం తెలియదని వివరించారు. అందువల్ల దీనిని సామూహిక అత్యాచారంగా భావించలేమన్నారు. పోక్సో చట్టాన్ని కూడా నిందితులపై ప్రయోగిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img