Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

మహారాష్ట్ర కాలువలో పడ్డ బస్సు.. 12 మంది మృతి.. 25 మందికి గాయాలు

మహారాష్ట్రలోని శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయగడ్‌ జిల్లాలోని ఓ లోయలో బస్సు పడిరది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు మరణించారు. మరో 25 మంది గాయపడినట్లుపోలీసులు తెలిపారు. పుణె నుంచి ముంబై వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ఈ ప్రమాదానికి గురైంది. ముంబై-పుణె పాత హైవేపై ఉన్న శిన్‌గ్రోబా ఆలయం సమీపంలో ఉన్న లోయలో బస్సు పడిరది.ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేశారు. గోరేగావ్‌లోని ఓ సంస్థకు చెందిన వ్యక్తులు అంతా పుణెకు వెళ్లి తిరుగు ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img