Monday, June 5, 2023
Monday, June 5, 2023

మా పతకాలు, అవార్డులు తిరిగి ఇస్తాం…రెజ్లర్ల సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ పోలీసుల అనుచిత ప్రవర్తనతో ఆగ్రహం వ్యక్తం చేసిన రెజ్లర్లు గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పోలీసుల నీచమైన ప్రవర్తనతో బాధపడి నిరసనకు దిగిన రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా గురువారం తమ పతకాలు, అవార్డులను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. తమకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేస్తుంటే తమను అవమానాలకు గురిచేస్తున్నపుడు ఈ గౌరవం తమకెందుకని రెజ్లర్లు ప్రశ్నించారు.ఓ మైనర్‌తో సహా ఏడుగురు రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 23వ తేదీ నుంచి రెజ్లర్లు దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని జంతర్ మంతర్ లో నిరసనకు దిగారు. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగిన రెజ్లర్లు రాత్రి బస చేసేందుకు మడత మంచాలను తీసుకువస్తుండగా, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి మధ్య గొడవ జరిగింది.ఈ గొడవలో వినేష్ ఫోగట్ సోదరుడు గాయపడ్డారు.మా రెజ్లర్ల పట్ల ఇలాగే వ్యవహరిస్తే, మేం పతకాలను ఏమి చేస్తాం? దీనికిబదులుగా మేం సాధారణ జీవితాన్ని గడుపుతాం, అన్ని పతకాలు ,అవార్డులను భారత ప్రభుత్వానికి తిరిగి ఇస్తాం్అని ఒలింపిక్ కాంస్య పతక విజేత బజరంగ్ గురువారం ఉదయం విలేకరులతో చెప్పారు.మహిళలను దుర్భాషలాడే హక్కు పురుషులకు ఉందా అని ఖేల్ రత్న అవార్డు గ్రహీత వినేశ్ ప్రశ్నించారు.తాము పతకాలన్నింటినీ తిరిగి ఇస్తాం, మా ప్రాణాలను కూడా ఇస్తాం అయితే కనీసం మాకు న్యాయం చేయండి…అంటూ రెజ్లర్లు వేడుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img