Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

మీ చదువులకు నాదీ బాధ్యత.. సీఎం జగన్‌

మీరు ఎంతైనా చదవండి.. మీ చదువులకు నాదీ బాధ్యత అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ, జగనన్న విద్యాదీవెనతో 100శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నామన్నారు. కుటుంబాల తలరాత మారాలంటే చదువే అస్త్రమని అన్నారు. పిల్లల చేతికి చదువు అనే అస్త్రం ఇచ్చినప్పుడే కుటుంబాల తలరాతలు మారుతాయన్నారు. వైఎస్‌ఆర్‌ ఫీజు రీయింబర్స్‌ పథకం తెస్తే.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ పథకాన్ని నీరుగార్చాయన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img