Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

మోగిన రాజ్యసభ ఎన్నికల నగారా

13 స్థానాలకు 31న పోలింగ్‌
14న నోటిఫికేషన్‌: ఈసీ

న్యూదిల్లీ: దేశంలో మరో ఎన్నికల సమరానికి తెరలేచింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడక ముందే ఆరు రాష్ట్రాల పరిధిలో 13 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల కమిషన్‌ (ఈసీ) షెడ్యూల్‌ ప్రకటించింది. మార్చి 31న ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్‌లో 5, కేరళలో 3, అసోంలో 2, హిమాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్‌ ప్రముఖులు ఆనంద్‌ శర్మ, ఏకే ఆంటోనీ సహా 13 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఏప్రిల్‌లో ముగియనున్న నేపథ్యంలో ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఆనంద్‌ శర్మ (హిమాచల్‌ప్రదేశ్‌), రాణీ నరాప్‌ా, రిపున్‌ బోరా (అసోం), ఏకే ఆంటోనీ, ఎంవీ శ్రేయస్‌ కుమార్‌, కె.సోమప్రసాద్‌ (కేరళ), కేజీ కెన్యే (నాగాలాండ్‌), జర్నా దాస్‌ (త్రిపుర), సుఖదేవ్‌ సింగ్‌, ప్రతాప్‌సింగ్‌ బజ్వా, శ్వైత్‌ మాలిక్‌, నరేశ్‌ గుజ్రాల్‌, శంషేర్‌ సింగ్‌ దుల్లో (పంజాబ్‌) పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనుంది. మార్చి 14న ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు మార్చి 21వ తేదీని గడువుగా నిర్దేశించారు. 22న నామినేషన్లు పరిశీలిస్తారు. 24 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. మార్చి 31న ఎన్నిక నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img