Sunday, May 28, 2023
Sunday, May 28, 2023

మోదీని గద్దె దించుదాం

. ఏప్రిల్‌ 14 నుంచి మే 15 వరకు దేశవ్యాప్తంగా సీపీఐ పాదయాత్రలు
. సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాల్లో జాతీయ కార్యదర్శి నారాయణ

విశాలాంధ్ర- విజయవాడ: కేంద్రంలోని నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో భారతదేశం ఏనాడూ చూడనంతగా తిరోగమనంవైపు నెట్టివేయబడిరదని, తక్షణమే మోదీని గద్దె దించాల్సిన అవసరం ఏర్పడిరదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ అన్నారు. ‘మోదీ హఠావోదేశ్‌ బచావో’ నినాదంతో ఏప్రిల్‌ 14వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్రలకు శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడిరచారు. ఈ పాదయాత్రలను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని, అవసర మైతే గ్రామగ్రామానికి వెళ్లి, మోదీ నియంతృత్వ పాలనపై ప్రజలను చైతన్యవంతులను చేయాలని పిలుపునిచ్చారు. రెండు రోజులు జరిగే సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమితి సమావేశాలు రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు కె.రామచంద్రయ్య అధ్యక్షతన శుక్రవారం విజయవాడ నగరంలోని దాసరిభవన్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన నారాయణ ప్రసంగిస్తూ, మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాడే అతనొక ప్రమాదకరశక్తిగా సీపీఐ గుర్తించిందని, నేడు మోదీ అరాచక పాలన దేశ రాజ్యాంగ మూలాలకే ముప్పును తీసుకువచ్చిందన్నారు. అదానీ అవకత వకలపై దర్యాప్తునకు జేపీసీ వేయాలని 16 ప్రతిపక్ష పార్టీలు చేసిన డిమాండ్‌ను మొండిగా తిరస్కరిస్తున్న మోదీ సర్కారు 12 లక్షల కోట్ల రూపాయల కుంభకోణంపై కుంటిసాకులతో కాలం వెళ్లదీస్తున్నదని వ్యాఖ్యానించారు. దేశంలోనే తొలిసారిగా సీబీఐ, ఈడీ, ఆర్‌బీఐ వంటి స్వతంత్ర ప్రతిపత్తిగల చట్టబద్ధ సంస్థలను మోదీ తన జేబు సంస్థలుగా మార్చుకొని ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీకి జైలు శిక్ష, అనర్హత వేటు ఇందుకు తాజా ఉదాహరణ అని చెప్పారు. మతోన్మాద ఎజెండాను అమలు చేస్తూనే దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతూ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశారని, పైగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశ ప్రజల దృష్టిని మరల్చడానికి జాతీయవాదాన్ని రగుల్కొల్పుతున్నారని విమర్శిం చారు. ఖలిస్థాన్‌ ఉద్యమం అనుకోకుండా తెరపైకి రావడం ఈ తరహా ప్రయత్నమేనని చెప్పారు. అదానీకి అన్ని పోర్టులను అప్పగించినా అడిగే దిక్కు లేకుండాపోయిందని, ప్రజల గొంతు కను నొక్కి, నియంతృత్వ పాలనను సాగిస్తున్న బీజేపీని తరిమి కొట్టడం అనివార్యమని నారాయణ అన్నారు. దేశాన్ని కాపాడుకోవడానికి, లౌకిక, ప్రజాతంత్ర వ్యవస్థలను పరిరక్షించుకోవడానికి సీపీఐ ముందుండి పోరాటాలు చేస్తుందని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా భావ సారూప్యత గల పార్టీలతో ప్రత్యామ్నాయం ఏర్పాటు దిశగా కృషి జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సమా వేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యకలాపాలపై నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి అనూహ్యమైన పరాజ యాలు ఎదురుకావడం జగన్‌ ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతకు పక్కా సంకేతంగా అభి వర్ణించారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యులు అక్కినేని వనజ, ఏఐకెఎస్‌ అధ్యక్షులు రావుల వెంకయ్య వేదికపై ఆశీనులయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img