Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

మోదీ పాలనలోనిరుద్యోగం పైపైకి

. 16 నెలల్లో అత్యధికం
. డిసెంబరులో 8.30 శాతానికి చేరిక

న్యూదిల్లీ: కేంద్రంలోని మోదీ నేతృత్వంలోని బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం గరిష్ఠ స్థాయికి చేరింది. గత 16 నెలల కాలంలో అత్యధికంగా డిసెంబరులో 8.30 శాతానికి చేరింది. అంతకు ముందు నెలలో ఇది 8 శాతంగా ఉందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) ఆదివారం తెలిపింది. పట్టణ నిరుద్యోగిత రేటు డిసెంబరులో అంతకుముందు నెలలో 8.96 శాతం నుంచి 10.09 శాతానికి పెరిగింది. అయితే గ్రామీణ నిరుద్యోగం రేటు 7.55 శాతం నుంచి 7.44 శాతానికి పడిపోయిందని గణాంకాలు పేర్కొన్నాయి. కాగా అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం, ఉద్యోగ మార్కెట్‌లోకి ప్రవేశించే లక్షలాది మంది యువకులకు ఉద్యోగాలు కల్పించడం 2024లో జరిగే జాతీయ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలనకు అతిపెద్ద సవాలుగా ఉందనేది సుస్పష్టం. బీజేపీ విభజన రాజకీయాలు, అధిక ధరలు, నిరుద్యోగం వంటి సమస్యలపై ప్రజల అభిప్రాయాన్ని సమీకరించేం దుకు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ సెప్టెంబరులో దక్షిణ నగరం కన్యాకుమారి నుంచి జమ్ముకశ్మీర్‌ ప్రాంతంలోని శ్రీనగర్‌ వరకు ఐదు నెలల పాటు ‘భారత్‌ జోడో యాత్ర’ను ప్రారం భించింది. ‘భారతదేశం జీడీపీ వృద్ధిపై ఒకే దృష్టి నుంచి ఉపాధి, యువత నైపుణ్యం, ఎగుమతుల అవకాశాలతో ఉత్పత్తి సామర్థ్యాలను సృష్టించడం వంటి వృద్ధికి వెళ్లాలి’ అని పార్టీ 3,500 కిలోమీటర్ల పాదయాత్రకు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ పాదయాత్రలో శనివారం విలేకరులకు చెప్పారు. రాష్ట్ర జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) సంకలనం చేసి నవంబరులో విడు దల చేసిన ప్రత్యేక త్రైమాసిక వివరాల ప్రకారం, గత త్రైమాసికంలో 7.6 శాతం పోలిస్తే జులైసెప్టెంబరు త్రైమాసికంలో నిరుద్యోగిత రేటు 7.2 శాతానికి తగ్గింది. డిసెంబరులో నిరుద్యోగిత రేటు ఉత్తర రాష్ట్రమైన హరియాణాలో 37.4 శాతానికి పెరిగింది. రాజస్థాన్‌లో 28.5 శాతం, దిల్లీలో 20.8 శాతంగా ఉందని సీఎంఐఈ గణాంకాలు పేర్కొన్నాయి. ఇదిలాఉండగా, ఉద్యోగాలు, ఉపాధి ఇటీవలి సంవత్స రాలలో దేశం కోసం నిరంతర ఆందోళనగా ఉన్నాయి. కోవిడ్‌-19 మహమ్మారి ఫలితంగా తీవ్రమైన ఉద్యోగ నష్టాలు సంభవించాయి. ఉపాధిపై మహమ్మారి ప్రభావం ముఖ్యంగా మహిళలపై తీవ్రంగా ఉంది. ఇది 2022లో కూడా కొనసాగింది. కోవిడ్‌19 వ్యాప్తిని అరికట్టడానికి తీసుకువచ్చిన లాక్‌డౌన్ల ప్రారంభ దెబ్బ నుంచి ఉపాధి కోలుకున్నప్పటికీ, పూర్తిగా కోలుకోలేదు. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ గృహ సర్వేల వివరాలను పరిశీలిస్తే… జనవరి 2020తో పోల్చితే, అక్టోబరు 2022లో దాదాపు 14 మిలియన్ల మంది తక్కువ మంది వ్యక్తులు ఉపాధి పొందారు. వీరిలో 4.5 మిలియన్ల పురుషులు, 9.6 మిలియన్ల మంది మహిళలు ఉన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భోపాల్‌లో గత అక్టోబరులో మీడియా ప్రచార్భా టం కోసం ‘రోజ్‌గర్‌ మేళా’ (ఉద్యోగాల కోసం మేళా) ప్రారంభించారు. అయితే వాస్తవం ఏమిటంటే, 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిరుద్యోగం చారిత్రాత్మకంగా అత్యధిక స్థాయికి చేరుకుంది. ఆ రోజ్‌గార్‌ మేళాలో లక్షల మంది ప్రజలు సంవత్సరాలుగా నిరుద్యోగులుగా ఉన్నప్పటికీ కేవలం 75 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. మోదీ ప్రభుత్వం నాలుగు వివాదాస్పద లేబర్‌ కోడ్‌ల అమలును మరింతగా అమలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇవన్నీ కార్మిక వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూలమైనవి. ఇవి అంతిమంగా వేగంగా ఉద్యోగ నష్టాలకు దారి తీస్తుంది. మోదీ ప్రభుత్వం దేశంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు నటిస్తూనే ఉంది. ప్రతిపక్షంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో పాటు నిరుద్యోగులు కూడా ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు దేశంలోని శ్రామిక శక్తికి మరిన్ని కష్టాలు ఎదురు కానున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img