Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

యూపీలో కొనసాగుతోన్న నాలుగో విడత పోలింగ్‌

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్‌ బుధవారం కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.నాలుగో దశలో 9 జిల్లాల్లోని 59 నియోజకవర్గాలకు ఓటింగ్‌ జరుగుతున్నది. మొత్తం 624 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. తొలి రెండు గంటల్లో అంటే ఉదయం 9 గంటల సమయానికి 9.10 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడిరచారు. పలుచోట్ల ఈవీఎం సమస్యలు తలెత్తాయి. ఉన్నావ్‌లోని సోహ్రామౌలో ఈవీఎంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఓటింగ్‌ ఆలస్యంగా మొదలైంది. తొలి గంటల్లో పలువురు ప్రముఖులు, ఎన్నికల అభ్యర్థులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆయన కుమారుడు పంకజ్‌ లఖ్‌నవూలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి లఖ్‌నవూలో తమ ఓటును వినియోగించుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img