Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

యూపీ అభివృద్ధికి నకిలీ సమాజ్‌వాదీలతో గండి : మోదీ

బిజ్నోర్‌ : నకిలీ సమాజ్‌వాదీల వారసత్వ విధానాలతో 2017కి ముందు ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధి ప్రవాహానికి అడ్డుకట్ట పడిరదని సోమవారం బిజ్నోర్‌లో జరిగిన ర్యాలీలో వర్చువల్‌గా పాల్గొన్న మోదీ విమర్శించారు. యోగి హయంలో అన్ని ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి జరిగిందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో గతంలోని రెండు ప్రభుత్వాలు చెల్లించిన దానికంటే ఎక్కువగా రూ.1.5లక్షల కోట్లను చెరకు రైతులకు రుణాల చెల్లింపునకు యోగి సర్కార్‌ ఇచ్చిందని మోదీ తెలిపారు.
అందుకే రాలేకపోయా..
వాతావరణం అనుకూలించని కారణంగా భౌతికంగా ర్యాలీలో పాల్గొనలేకపోయినట్లు బిజ్నోర్‌లోని మద్దతుదారులనుద్దేశించి మోదీ తెలిపారు. ర్యాలీకి బర్దామన్‌ కాలేజి మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా వాతావరణం అనుకూలించని కారణంగా ఆయన రాలేకపోయారు. వర్చువల్‌గా ర్యాలీనుద్దేశించి మాట్లాడారు. బిజ్నోర్‌లో ఎనిమిదికిగాను ఐదు స్థానాల్లో బీజేపీ, మూడు స్థానాల్లో ఎస్పీకి పట్టు ఉంది. జనాభాలో దాదాపు సగం దళితులు, ముస్లింలు ఉన్నారు. బిజ్నోర్‌, నగినా లోక్‌సభ స్థానాలు బీజేపీ వద్దనున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img