Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

ర‌జినీకాంత్ కు మంత్రి రోజా చుర‌క‌లు

  • సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ నిన్న చేసిన‌ వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్‌ ఇచ్చారు. రజనీకాంత్‌కు తెలుగు రాష్ట్రం, రాజకీయాలపై అవగాహన లేదని చుర‌క‌లంటించారు. మంత్రి రోజా ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. రజనీకాంత్‌ వ్యాఖ్యలతో ఎన్టీఆర్‌ ఆత్మ కూడా బాధపడుతుందన్నారు. రజనీకాంత్‌తో చంద్రబాబు అబద్ధాలు చెప్పించారన్నారు. ఎన్టీఆర్‌ ఏమన్నారో.. రజనీకాంత్‌కు వీడియోలు ఇస్తాను. ఎన్టీఆర్‌పై దారుణంగా కార్టూన్లు వేసి అవమానించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. రజనీకాంత్‌కు తెలుగు రాష్ట్రం, రాజకీయాలపై అవగాహన లేదని, రజనీకాంత్‌ వ్యాఖ్యలతో ఎన్టీఆర్‌ ఆత్మ కూడా బాధపడుతుందన్నారు. ఎన్టీఆర్‌ అభిమానులను బాధపెట్టేలా రజనీకాంత్‌ మాట్లాడారన్నారు. చంద్రబాబు లేనప్పుడే హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని, విదేశాల్లో తెలుగువారు ఉద్యోగాలు పొందడానికి కారణం వైఎస్సాఆర్ అన్నారు. ఇందుకు కారణం చంద్రబాబు కాదని రజనీకాంత్‌ తెలుసుకోవాలన్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌ తెచ్చింది వైఎస్సార్.. చంద్రబాబు కాదు. చంద్రబాబు విజన్‌ 2020 వల్ల టీడీపీ 23 సీట్లకు పరిమితమైందన్నారు. విజన్‌ 2047కి చంద్రబాబు ఏ దశలో ఉంటారో రజనీకాంత్‌కి తెలుసా?. ఇలాంటి వ్యాఖ్యలు చేసి.. రజనీకాంత్‌పై తెలుగు ప్రజలకు ఉన్న గౌరవం తగ్గించుకున్నారని రోజా అన్నారు. రజనీకాంత్‌ చెప్పినట్టు 2024లో చంద్రబాబు సీఎం అయ్యే అవకాశమే లేదన్నారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img